పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ముంబై నుంచి కాకినాడకు వస్తున్న లోకమాన్య తిలక్ విజయవాడ వస్తుంది. ఈ తరుణంలో కృష్ణాకెనాల్ రైల్వేస్టేషన్ దాటి వేగంతో వస్తుంది. అయితే స్టేషన్ సమీపలో ఓ యువకుడు సూసైడ్ చేసుకునేందుకు ట్రాక్ పై పడుకొని ఉండటం ట్రైన్ నడుపుతున్న వ్యక్తి గమనించాడు. ఇక అతను ఒక్కసారిగా ఎమర్జెన్సీ బ్రేక్ వేసి ట్రైన్ సడన్ గా ఆపాడు. దీంతో ప్రయాణికులు ఏమి అర్ధం కాకపోవడంతో హడలిపోయారు. అయితే మరోవైపు ట్రైన్ ఇంజన్ మాత్రం యువకుడి కాళ్లపై నుంచి వెళ్లడంతో రెండు పాదాలు తెగిపోయాయి.
ఇక ఇంజన్ నుంచి దిగిన లోకోపైలెట్ హనుమతరావు, అసిస్టెంట్ రఘురామరాజు వెంటనే వెనుక బోగీ వద్దకు పరుగులు పెట్టి బయటికి తీశారు. యువకుడి తెగిపడిన పాదాలను పాలిథిన్ కవర్లో వేసి అదే రైలులోకి ఎక్కించారు. వారు వెంటనే కృష్ణాకెనాల్ స్టేషన్ అధికారులకు సమాచారం అందించారు. అయితే యువకుడి పరిస్థితి విషమించే అవకాశముండటంతో విజయవాడ తీసుకెళ్లాలని తెలిపారు. రైలు విజయవాడ చేరుకోగానే అతడిని ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
ఈ ఘటనలో గాయపడిన యువకుడు గుంటూరు జిల్లా తాడేపల్లిలోని నులకపేటకు చెందిన పృథ్వీగా గురించారు. బాధితుడిని నుండి సమాచారం తెలుసుకొని పోలీసులకు సమాచారం అందించారు. అతడు ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడేని విషయం గురించి తెలీదు. ఇక ప్రస్తుతం అతడు మాట్లాడలేక పోతున్నాడని, ఆత్మహత్యాయత్నానికి కారణాలు తెలియదని పోలీసులు తెలిపారు. యువకుడికి ప్రాణాపాయం తప్పినట్లు తెలిపారు. అయితే యవకుడిని గమనించి ట్రైన్ ను ఆపడమే కాకుండా... అతడి ప్రాణాలు కాపాడినంద లోకో పైలెట్లను ప్రయాణికులు అభినందలు తెలిపారు. ఈ ఘటనపై రైల్వే ఉన్నతాధికారుల స్పందన ఎలా ఉంటుందో చూడాలి మరి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి