తమిళనాడు రాష్ట్రంలోని పెరంబదూర్ జిల్లా బాగాలూరు కు చెందిన ధన శేఖరన్, కరురు జిల్లాకు చెందిన మాలతికీ కొన్ని సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. పెళ్లి చేసుకున్న మొదట్లో భార్య భర్తల మధ్య కాపురం చక్కగా సాగింది. వీరికి సంతానంగా కొడుకు కూడా పుట్టాడు. అయితే ధన శేఖరన్ ఒక ప్రైవేట్ కంపెనీలో మేనేజర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. మంచి జీతం కూడా వస్తోంది. ఈ క్రమంలోనే ఆయన మద్యానికి బానిసయ్యాడు. ప్రతిరోజు మద్యం తాగుతూ వస్తున్నాడు. ఎలా తయారయ్యాడు అంటే తాగుబోతు అని చెప్పడానికి కూడా పదం సరిపోనంతగా తాగుడుకు బానిసయ్యాడు. రాత్రింబవళ్ళు తాగుతూ ఎక్కడపడితే అక్కడ పడిపోతున్నాడు. రాత్రి సరిగా ఇంటికి రాకపోవడం. ఇంటి ఖర్చులకు కూడా డబ్బు ఇవ్వకపోవడం దీంతో విసుగు చెందినటువంటి భార్య తన కొడుకుని తీసుకుని కరురులోని తన పుట్టింటికి వెళ్ళింది. మూడు రోజులైనా అతని మత్తు దిగలేదు . మత్తు దిగిన తర్వాత భార్య మాలతి ఇంటికి వస్తుందని మూడు రోజులు వేచి చూశాడు. ఆమె రాకపోవడంతో ఆయన అక్కడికి వెళ్లి మాలతినీ తీసుకొచ్చాడు. తన పుట్టింటికి వెళ్లి తన పరువు తీస్తున్నాడని మాలతి ఆవేదన చెందింది. ఎంత చెప్పినా ఆయన మారడం లేదని ఆవేదన చెందిన మాలతి ఆత్మహత్య చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చింది. బాగా తాగి వచ్చిన ధనశేఖర్ భార్య మాలతి ఇంట్లో నిద్రపోతున్న ఈ సమయంలో వచ్చి అదే రూమ్ లో నిద్ర పోయాడు. మత్తులో చలనం లేకుండా పడుకున్నా భర్త కళ్ల ముందే మాలతి ఫ్యాన్ కు ఉరి వేసుకుంది. కొద్ది సమయం తర్వాత మెలకువ వచ్చినా ధన శేఖరన్ భార్యను కిందకుదించడానికి ప్రయత్నించాడు. మత్తులో అతి కష్టం మీద ఆమె ఉరి వేసుకున్న తాడును చాకుతో కోసి కిందకు దించాడు. ఆ తర్వాత ఆ శవాన్ని పక్కనే పడుకోబెట్టుకుని దర్జాగా నిద్రపోయాడు శేఖరన్.
మద్యం మత్తులో ఉలుకూ పలుకూ లేకపోవడంతో తన కొడుకు భయంతో ఏడుపు మొదలు పెట్టాడు. దీంతో చుట్టుపక్కల వాళ్ళు అంతా వచ్చి చూడగా మాలతి శవమై కనిపించింది. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని శవాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ధనశేఖర్ కు నాలుగు తగిలించి మజ్జిగ తాగించారు. మద్యం మత్తు దిగిన తర్వాత ఏం జరిగిందని పోలీసులుని అడిగాడు. అంటే మద్యం మత్తులో అంత మర్చిపోయి భార్య శవం పక్కన పడుకోబెట్టుకున్న ఈ కసాయి భర్త గురించి ఆ ప్రాంతంలో కలవరం రేపింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి