ఇటీవలి కాలంలో రోజురోజుకు పరువు హత్యలు పెరిగిపోతున్నాయి. నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తుంటే అసలు ప్రేమించడమే పాపమా అన్న విధంగా మారిపోయింది పరిస్థితి. ప్రేమించిన పాపానికి ఎన్నో ప్రేమజంటలు ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కొన్ని కొన్ని సార్లు కుటుంబాలు దారుణంగా వ్యవహరిస్తూ ఏకంగా పరువు హత్యలకు పాల్పడుతున్న ఘటనలు సంచలనం గా మారిపోతున్నాయి. మరికొన్ని సార్లు తమ ప్రేమను పెద్దలు ఒప్పుకోరు అన్న కారణంతో ఇక ప్రేమజంట లు ఆత్మహత్యకు పాల్పడుతున్నాయి .


 ఇలా ప్రేమ అనేది నేటి రోజుల్లో ప్రాణం పోవడానికి కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది  ఇక ఇటీవల కాలంలో వెలుగులోకి వస్తున్న ఘటనలు అయితే అమానవీయంగా ఉన్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక్కడ ఇలాంటి సంఘటన వెలుగులోకి వచ్చింది. ప్రేమించడమే ఆ యువకుడి పాలిట శాపంగా మారి పోయింది. ఓ యువతిని ప్రేమించిన  పాపానికి ఆ యువతి అన్న యువకుడిని దారుణంగా అత్యంత పాశవికంగా హత్య చేసి చంపిన ఘటన బీహార్ లో వెలుగులోకి వచ్చింది.  ఘటన బీహార్ తో ఒక్కసారిగా స్థానికులు అందరూ ఉలిక్కిపడ్డారు.



 బీహార్ లోని ముజఫర్ జిల్లాలో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. తమ చెల్లెలినీ ప్రేమించాడు అన్న కోపంతో ఏకంగా యువకుడి మర్మాంగాన్ని కోశాడు యువతి అన్న. అనంతరం దారుణంగా హత్య చేశాడు. సౌరబ్ అనే 22 ఏళ్ల యువకుడు అదే ప్రాంతంలో ఉండే యువతిని ప్రేమిస్తున్నాడు. అయితే ఈ విషయం ఇటీవల యువతి సోదరులకు తెలిసింది. ఈ క్రమంలోనే ఇక ఆ యువతి సోదరులు  తమ స్నేహితులను వెంటబెట్టుకుని యువకుడిని మాట్లాడదాం అంటూ ఇంటికి పిలిపించుకున్నారు. ఆ తర్వాత ఇంటికి వచ్చిన యువకుడు మర్మాంగం  కోసేసారు. తర్వాత చిత్రహింసలకు గురిచేశారు. ఇక చనిపోతాడు అని భావించి ఆసుపత్రిలో వదిలి వెళ్ళిపోయారు. ఇక ఆ తర్వాత కాసేపటికి ఆ యువకుడు చనిపోయాడు. దీనిపై బంధువులు కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే పోలీసులను ఆశ్రయించారు.  కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: