ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా కూడా దొంగల బెడద ఎక్కువ అయిపోతుంది. ఇంటికి తాళం కనిపించింది అంటే చాలు దొంగలు రెచ్చిపోతున్నారు. తాళం పగులగొట్టి రహస్యంగా ఇంట్లోకి చొరబడి ఇక అందినకాడికి దోచుకుంటున్నారు. దీంతో గడప దాటి ఇంటి బయటకు వెళ్లాలి అంటేనే భయపడిపోతున్నారు ఇంటి యజమానులు. కేవలం ఒకే ప్రాంతంలో కాదు దాదాపుగా అన్ని ప్రాంతాలలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక ఇటీవల కాలంలో అయితే ఏకంగా సోషల్ మీడియాలో చూసి దోపిడీలు చేయడం ఎలా అని కూడా నేర్చుకుంటున్నారు ఎంతోమంది. అంతేకాకుండా ఎలాంటి ఆచూకీ దొరకకుండా పోలీసులకు పట్టుబడకుండా పక్కా ప్లాన్తో దొంగతనాలకు పాల్పడుతూ ఏకంగా పోలీసులకు సవాల్ విసురుతున్నారు. అయితే ఇలా దొంగలు పడ్డారు అంటే అందినకాడికి దోచుకోవడం ఇంటిని గుల్ల చేయడం చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ ముంబైలో మాత్రం విచిత్ర ఘటన చోటుచేసుకుంది. ఇక్కడ ఒక హోటల్ లో దొంగలు పడ్డారు. అయితే దొంగలు డబ్బులు నగల జోలికి అస్సలు పోలేదు. మరి ఏం దొంగలించారు అని అంటారా.. కేవలం ఒక భారీ విగ్రహాన్ని మాత్రమే ఎత్తుకెళ్లారు. దీని కోసం చాలానే కష్టపడ్డారు ఆ దొంగలు. ఏకంగా సొరంగం కూడా తవ్వారు. ఆ ప్రాంతంలో ఇంపీరియల్ ప్యాలెస్ హోటల్ వుంది. అయితే ఈ హోటల్కు వెనకవైపు నుంచి దొంగలు కొన్ని రోజుల పాటు కష్టపడి సొరంగం తో తొవ్వారు. ఇక ఆ తర్వాత సొరంగం ద్వారా హోటల్ లోకి ప్రవేశించారు. ఇక అక్కడ ఉన్న పది అడుగుల భారీ సైనిక విగ్రహాన్ని చోరీ చేశారు. డబ్బులు నగల జోలికి మాత్రం వెళ్లక పోవడం గమనార్హం. అయితే ఈ విగ్రహానికి ఒక స్పెషాలిటీ ఉంది. ఇటలీలో తయారు చేసారు. దీని ధర దాదాపు ఏడు లక్షల వరకు ఉంటుంది. కొన్ని రోజుల కిందట హోటల్ సిబ్బంది పోలీస్ స్టేషన్ లో విగ్రహం కనిపించట్లేదని ఫిర్యాదు చేయగా పోలీసులు దర్యాప్తులో ఇక వెనుక వైపు ఉన్న సొరంగం బయటపడింది. ఇక ఆ తర్వాత దొంగలముఠా లోని ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి: