ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది ఒక మధురమైన జ్ఞాపకం. నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకుని ఇక జీవితాంతం ఎంతో సంతోషంగా గడపాలని భావిస్తూ ఉంటారు ప్రతి ఒక్కరు. ఈ క్రమంలోనే పెళ్లి పై ఎన్నో కలలు కంటూ ఉంటారు.  కానీ కొన్ని కొన్ని సార్లు పెద్దల ఒత్తిడితో పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. అయితే కొంతమంది పెద్దలకు ఎదురు చెప్పలేక పెద్దలు కుదిర్చిన సంబంధాన్ని చేసుకుంటూ ఉంటారు. మరికొంతమంది  ఒప్పుకున్నట్టే ఒప్పుకొని చివరి నిమిషంలో కుటుంబ సభ్యులకు షాక్ ఇవ్వడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇటీవలి కాలంలో ఇలాంటి తరహా ఘటనలు చాలానే వెలుగులోకి వస్తున్నాయి. ఇక్కడ ఇలాంటి ఘటనే జరిగింది. మరో రెండు గంటల్లో పెళ్లి అంతలో వరుడు ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు. అప్పటివరకు పెళ్లి అంటే తనకు ఇష్టం అంటూ చెప్పిన వరుడు ఇక మరో రెండు గంటల్లో పెళ్లి జరుగుతుంది అనుకుంటున్న సమయంలో కనిపించకుండా పోయాడు. ఈ ఘటన కృష్ణా జిల్లా పెనమలూరు లో చోటుచేసుకుంది. పెనమలూరు కు చెందిన అనిల్ ఓ యువతి ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరు మేనేజర్లు కావడం గమనార్హం. తమ ప్రేమ విషయాన్ని పెద్దలకు చెప్పి పెళ్లి చేసుకోవాలని భావించారు. పెద్దలు కూడా పెళ్లికి ఒప్పుకోవడంతో ఇక వారి ప్రేమకు అడ్డు లేకుండా పోయింది. ఈ క్రమంలోనే ఇక పెళ్ళికి అంతా సిద్ధం అయిం.ది మరో రెండు గంటల్లో పెళ్లి జరగాల్సి ఉంది. కానీ అంతలో వరుడు కనిపించకుండా పోయాడు. దీంతో అందరూ ఒక్కసారిగా షాకయ్యారు. ఇక కాస్త లేట్ అయినా వస్తాడు అని సాయంత్రం వరకు ఎదురు చూసారు. ఎంతసేపటికీ రాకపోవడంతో ఏం చేయాలో ఎవరికీ అర్థం కాలేదు. అతడు తప్పించుకొని పారిపోయాడు అని ఇక రాడు అని భావించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఈ వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. ఇక అనిల్ ఆచూకీ కోసం ఆరా తీస్తున్నారు పోలీసులు. అయితే ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోబోతున్నాను అన్న సంతోషం ఆ యువతికి లేకుండా పోయింది. పెళ్లి కుమారుడు వైఖరిపై వధువు తరపు బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: