మనిషి మానవత్వం లేని మృగంలా మారిపోతున్నాడు. జాలి దయ లేని కాసాయిల  తయారవుతున్నాడు. ప్రాణాలు తీయడానికి అస్సలు వెనకాడటం లేదు. పరాయి వ్యక్తుల విషయంలో ఉన్మాదిగా మారి పోవడం కాదు.. ఏకంగా సొంత వారి విషయంలో కూడా కిరాతకంగా ప్రవర్తిస్తున్నారూ. అది కూడా రక్తం పంచుకుని పుట్టిన వారి మీద సైతం కనీస కనికరం చూపించడం లేదు నేటి రోజుల్లో జనాలు. అభం శుభం తెలియని చిన్నారులను దారుణంగా హతమారుస్తూన ఘటనలు రోజురోజుకీ వెలుగులోకి వస్తు సభ్య సమాజాన్ని ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. ఇక్కడ అభం శుభం తెలియని ఓ చిన్నారిని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తండ్రి ప్రాణం తీసాడు.



 అమ్మ పొత్తిళ్లలో ఆడుకోవాల్సిన ఆ చిన్నారి చివరికి ఊరి చివర్లో ఉన్న చెరువులో శవమై తేలింది. రెండు నెలలు కూడా నిండని ఆ పసికందు కు అప్పుడే నిండు నూరేళ్ళు నిండిపోయాయి. అమ్మ పొత్తిళ్లలో పడుకొని అమ్మ పాలు తాగాల్సిన ఆ చిన్నారి చివరికి తండ్రి క్రూరత్వానికి బలి అయ్యింది. చిన్నారి కూతురు ని దగ్గరికి తీసుకుని అల్లారుముద్దుగా ఆడించ వలసిన ఆ తండ్రి చివరికి నోటికి టేపు వేసి గోనెసంచిలో కట్టి దారుణంగా రెండు నెలల చిన్నారి ని హతమార్చాడు. చిన్నారి మృతదేహం పైకి తేలకుండా ఇక సంచిలో ఒక రాయి కూడా కట్టి నీళ్లల్లో పడేసాడు. ఎంతో మంది హృదయాలను కదిలిస్తున్న ఈ ఘటన అనంతపురం జిల్లాలో వెలుగులోకి వచ్చింది.



 శెట్టూరు మండలం ఐదు కల్లు వాసి మల్లికార్జున బెంగళూరులో ఓ ప్రైవేట్ బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాడు. అతనికి నర్సాపురానికి చెందిన చిత్తమ్మ తో గత ఏడాది కిందట వివాహం జరిగింది. కొంతకాలానికే ఆమెపై అనుమానం పెంచుకున్నాడు మల్లికార్జున  ఈ క్రమంలోనే భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతూ వస్తున్నాయి. ఇక ఇటీవలే ఆగస్టులో వీరికి ఒక పాప పుట్టింది. ఇక ఇటీవలే చిన్నారి పాప అనారోగ్యానికి గురికావడంతో భార్యభర్తలు ఇద్దరూ కళ్యాణదుర్గం ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే పాప ఏడుస్తుంటే  ఓదారుస్తూ బయటికి తీసుకెళ్లాడు మల్లికార్జున. కానీ మళ్ళీ తిరిగి రాలేదు. ఫోన్ చేసినా సమాధానం ఇవ్వలేదు. దీంతో ఆందోళనకు గురై పోలీసులకు సమాచారం అందించారు కుటుంబ సభ్యులు. అయితే పాపను చంపి నీటిలో పడేసినన విషయాన్ని మల్లికార్జున స్నేహితుడికి ఫోన్ చేసి చెప్పాడు. ఈ విషయం పోలీసుల దృష్టికి రావడంతో నిందితున్ని పట్టుకొని విచారిస్తున్నారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి: