జిమ్ ఆధునిక జీవన శైలిలో ఓ భాగమైపోయింది. సెలబ్రిటీల నుండి సామాన్యుల దాకా అందరికీ ఫిట్నెస్ పై ప్రేమ పెరిగింది. వర్కౌట్ లతో దేహ దారుడ్యాన్ని పెంచుకోవడం ఆసక్తిగా మారింది. అయితే ఏదైనా ఓ మోతాదు వరకే బాగుంటుంది. శృతి మించితే అసలుకే మోసం వస్తుంది. ప్రాణాలు హరించి వేస్తుంది. శరీరం సౌకర్యవంతంగా ఉండడానికే వ్యాయామం కానీ సామర్థ్యానికి మించి కష్ట పెట్టడానికి కాదు. మితిమీరిన వ్యాయామాలతో  ముప్పు ముంచుకొస్తోంది. ఎంత వ్యాయామం చేస్తే అంత మంచిది. శరీరాన్ని ఎంత కష్టపడితే అంత ఆరోగ్యంగా ఉంటారనుకుంటారు అందరూ కానీ అది నిజం కాదని నిరూపిస్తున్నాయి సెలబ్రెటీలు కొందరి యువకుల హఠన్మారణాలు.

పునీత్ రాజకుమార్ జిమ్ చేస్తుండగా గుండెపోటు తో మరణించిన తర్వాత వ్యాయామం మంచిదా కాదా అన్నదానిపై తీవ్ర చర్చ జరుగుతోంది. పునీత్ ఎంతో ఫిట్ నెస్ తో ఉంటారు. నిరంతరం వ్యాయామాలతో కుస్తీ పడుతుంటారు. జిమ్ లో ఆయన చేసే వర్కౌట్లు చూస్తే క్రీడాకారులకు తప్ప మామూలు వ్యక్తులకు అలాంటి ఫీట్లు సాధ్యం కాదనిపిస్తుంది. మెలి తిరిగిన కండల కోసం శక్తిని మించిన వ్యాయామం చేస్తే ప్రమాదమే అంటున్నారు వైద్య నిపుణులు. ఒకప్పుడు ఉదయం పూటో సాయంత్రం వేళలోనో జిమ్ కు వెళ్లేవారు. కానీ ఇప్పుడు అలా సమయపాలనేమి ఉండడం లేదు. ఉదయం 5 గంటల నుంచి 7 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు వ్యాయామానికి సరైన సమయమని అంటున్నారు డాక్టర్లు. కఠిన వ్యాయామాలు చేసేటప్పుడు కార్డియాకారిస్ట్ సంభవించే అవకాశం ఉంటుందని అప్పుడు ట్రైనర్లో చుట్టుపక్కల ఉన్న వారు తక్షణమే సిపిఆర్ అందిస్తే బాధితునికి ప్రాణాపాయం తప్పుతుందని వైద్యులు అంటున్నారు. అలాగే హెవీ వర్కౌట్స్ చేసేటప్పుడు  జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు జిమ్ ట్రైనర్లు. మజిల్ వర్కౌట్లు చేసిన తర్వాత కచ్చితంగా రెస్ట్ తీసుకోవాలంటున్నారు. కండలు తిరిగిన దేహం ఉంటేనే ఆరోగ్యానికి మంచిది అన్న భావనలో ఉండకూడదని ఎక్కువ కాలం జీవించే జపాన్ వాసులకు అసలు కండలే ఉండవనే విషయం గుర్తుంచుకోవాలంటున్నారు నిపుణులు.

వ్యాయామానికి ముందు అల్పాహారం తీసుకోవాలి. మానసిక ఒత్తిడి, అధిక వ్యాయామం గుండెకు ప్రమాదం. అలాగే సమతుల ఆహారం తప్పనిసరి. ప్రోటీన్స్ ఎక్కువ ఉండే ఆహరం తీసుకోకూడదు. అలాగే బరువు తగ్గేందుకు టార్గెట్లు పెట్టుకొని వ్యాయామాలు చేయడం కూడా సరైంది కాదంటున్నారు వైద్యులు. నెలకు రెండు కిలోలకు మించి బరువు తగ్గడం ఆరోగ్యానికి హానికరమని హెచ్చరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: