కానీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా నిరుద్యోగులకు తిప్పలు తప్పడం లేదు. ఎన్నో రోజుల నుంచి ప్రభుత్వ ఉద్యోగాలను సాధించడం కోసం పోటీ పరీక్షల కోసం సిద్ధమవుతున్నారు ఎంతోమంది. కానీ ప్రభుత్వం మాత్రం నోటిఫికేషన్లు విడుదల చేయకపోవడంతో నిరుద్యోగులకు నిరీక్షణ తప్ప ఎలాంటి ఉపయోగం లేకుండాపోతుంది. ఎన్నికల వచ్చినప్పుడే ఉద్యోగాల నోటిఫికేషన్ తెరమీదకు తెస్తున్న ప్రభుత్వం ఎన్నికల అయిపోగానే ఈ విషయాన్ని మరచి పోతుంది.
దీంతో ఇటీవల కాలంలో ఎంతో మంది నిరుద్యోగులు ఇక నిరాశ చెంది ఆత్మహత్య చేసుకున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఇక్కడ ఓ యువకుడు ఇక ఉద్యోగం రాదు అని భావించి మనస్థాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం లేదంటూ తీవ్ర కలత చెంది ఓ నిరుద్యోగి ఆత్మహత్య చేసుకున్న ఘటన సిద్దిపేట జిల్లాలోని చెల్లాపూర్ లో వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన రాజేష్ యాదవ్ అనే వ్యక్తి డిగ్రీ చదివి ల్యాబ్ టెక్నీషియన్ పూర్తి చేశాడు. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నాడు. కానీ ప్రభుత్వం మాత్రం నోటిఫికేషన్లు ప్రకటించకపోవడంతో మనస్థాపం చెంది పొలం వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. చేతికొచ్చిన కొడుకు కళ్ళముందు విగతజీవిగా కనిపించడంతో తల్లిదండ్రులు బోరున విలపించారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి