ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా మహిళలపై లైంగిక వేధింపులు ఎక్కువైపోతున్నాయి. కొంత మంది కామాంధులు మహిళలు కనబడగానే మానవ మృగాలు లాగా మారిపోయి మహిళలపై బలవంతంగా అత్యాచారం చేసిన ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇక మరికొంతమంది మంచి వాళ్ళ ముసుగులో నటిస్తూ సమయం కోసం ఎదురు చూసి చివరికి అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ఇంకొంతమంది శారీరక వాంఛలు తీర్చుకోవడానికి ప్రేమ అనే ముసుగు వేసుకుంటున్నారు. నువ్వంటే ఇష్టం నువ్వు లేకుండా బ్రతకలేను పెళ్లి చేసుకొని జీవితాంతం కలిసి ఉందాం అంటూ మాయ మాటలు చెప్పి చివరికి లైంగిక దాడికి పాల్ప డుతున్నారు..


ఇలా ఎంతోమంది కేటుగాళ్లు ప్రేమ అనే ముసుగులో దారుణాలకు పాల్పడుతున్న ఘటనలు ఇటీవల కాలంలో కూడా వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. దీంతో మహిళల జీవితం రోజురోజుకీ ప్రశ్నార్థకంగా మారిపోతోంది. ఇక్కడ ఓ నీచుడు ఇలాంటి దారుణానికి పాల్పడ్డాడు. నువ్వంటే ఇష్టం నీ కోసం ఏదైనా చేస్తాను నువ్వు లేకుండా అసలు బ్రతకలేను.. నువ్వు లేని జీవితాన్ని కలలో కూడా ఊహించలేదు అంటూ ఎన్నో మాయమాటలు చెప్పి యువతిని ప్రేమలోకి దింపాడు. ఇక తనతో పాటు చదువుకున్న స్నేహితుడే కదా అనీ యువతి ప్రేమను అంగీకరించిన తర్వాత పెళ్లి పేరు చెప్పి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలని యువతి నిలదీయగా ముఖం చాటేస్తూ తిరగడం మొదలుపెట్టాడు. సాలిపేట కు చెందిన యువతి టెన్త్ క్లాస్ మేట్ అయినా అదే గ్రామానికి చెందిన బలరాం కళ్యాణ్ అనే యువకుడు ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకుంటాను అంటూ వెంట పడ్డాడు. అయితే తొలుత అతని ప్రేమను తిరస్కరించిన యువతి.. నువ్వు లేకుండా బతకలేను చచ్చిపోతాను అండ్ బ్లాక్ మెయిల్ చేయడంతో చివరికి అతని ప్రేమను అంగీకరించింది. ఈ క్రమంలోనే పలుమార్లు ఆమెపై లైంగికదాడి చేశాడు ఆ యువకుడు. ఇక ఇటీవలే పెళ్లి చేసుకోవాలని నిలదీయగా ముఖం చాటేస్తూ తిరిగారు.  ఇంటికి వెళ్లి ప్రశ్నించగా కుటుంబ సభ్యులందరూ పెళ్లి చేసేది లేదు అంటూ తేల్చి చెప్పారు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించి న్యాయం చేయాలని డిమాండ్ చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: