ఈ మధ్యకాలంలో బాత్రూం లో సీక్రెట్ కెమెరాలు పెట్టి ఇలాంటి అరాచక ఘటనలకు పాల్పడే ఎటువంటి సంఘటనలు ఎక్కువైపోయాయి. కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ లో జరిగిన ఘటన మరవకముందే మళ్లీ ఘటన వెలుగులోకి వచ్చింది. మరి అది ఎక్కడ జరిగిందో తెలుసుకుందామా..?  రోగాలు నయం చేసుకుందామని ఆస్పత్రులకు వస్తే వచ్చినవారికి అవమానాలు ఎదురవుతున్నాయి. ప్రాణాలు కాపాడాల్సిన ఆసుపత్రి యాజమాన్యాలు మహిళల మానాలు తీయడంలో ముందుకుపోతున్నారు. కరీంనగర్ జిల్లా లోని రేనే ఆసుపత్రికి ఓ వ్యక్తి అనారోగ్యంతో చికిత్స చేసుకోడానికి ఆసుపత్రికి తన కుటుంబీకులతో వచ్చాడు.

ఆ పేషెంట్ వెంట వచ్చిన మహిళ అక్కడి బాత్రూంలో స్నానం చేస్తుండగా మొబైల్ ఫోన్ లో వీడియో తీసిన అమానవీయ ఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంటకు చెందిన రమేష్ అనే వ్యక్తికి ఐదు రోజుల క్రితం హైబీపీ వచ్చి స్పృహ కోల్పోగా అతన్ని కరీంనగర్ పట్టణంలోని రేనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే పేషెంట్ తరపున కుటుంబ సభ్యులు కూడా వచ్చి నాలుగు రోజులు అవ్వడంతో సోమవారం డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు తెలియజేశారు. కాగా కుటుంబ సభ్యులంతా గత మూడు రోజుల నుంచి స్నానం చేయలేదని పేషెంట్ యొక్క భార్య ఇద్దరు కూతుర్లు స్నానం చేసి వెళ్దామని అనుకున్నారు. అయితే బాత్రూంలో గదిలోకి వెళ్లి ముందుగా తల్లి స్నానం చేసి వచ్చింది. ఆ తర్వాత చిన్న కూతురు స్నానం చేసే  సమయంలో ఒక రంధ్రంలో నుండి ఎవరో వీడియో తీస్తున్నట్టు గమనించిన అమ్మాయి అరిచింది. వెంటనే అక్కడకు వచ్చిన తల్లి ఏంటి అని అడగగా జరిగిన విషయం అంతా చెప్పింది. రంద్రం ఉన్నటువంటి రూమ్ దగ్గర తల్లి కూతురు వెళ్లి  చూసేసరికి హాస్పిటల్ డ్రెస్ వేసుకొని ఓ వ్యక్తి ఉన్నాడు. ఎవరు నువ్వు అని అడగగా హాస్పిటల్ సిబ్బంది అని చెప్పాడు.

ఏం చేస్తున్నావ్ అని ఆమె ప్రశ్నిస్తే అక్కడి నుంచి పరారయ్యాడు. ఇదే విషయమై బాధితులు ఆసుపత్రి యాజమాన్యాన్ని నిలదీసిన స్పందించలేదు. కుటుంబ సభ్యులు ఉదయం నుండి సాయంత్రం వరకు హాస్పిటల్ ముందు బైఠాయించి హాస్పిటల్ యాజమాన్యం నిర్లక్ష్యం ధోరణిపై ధర్నా కార్యక్రమం నిర్వహించారు. అయినా ఆస్పత్రి యాజమాన్యం పట్టించుకోకపోవడంతో బాధితుడు మీడియాను సంప్రదించారు. దీంతో ఈ విషయం కాస్తా పోలీసుల దాకా వెళ్లింది. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు వీడియో తీసిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: