
ఆడపిల్ల ఒంటరిగా కనిపించింది అంటే చాలా దారుణంగా అత్యాచారం చేయడం అంతటితో ఆగకుండా ప్రాణాలు తీసుకోవడం లాంటి ఘటనలు జరుగుతున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో ఏకంగా ఆడపిల్ల అని కూడా చూడకుండా దారుణంగా దాడులకు పాల్పడుతున్న ఘటనలు ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేస్తున్నాయి. ఇటీవలే బీహార్లో ఇలాంటి తరహా ఘటన జరిగింది. పట్టపగలు అందరూ చూస్తుండగా ఒక మహిళ చీర లాగేయడమే కాదు ఇక కాల్చిన వెదురు బొంగులతో ఆ మహిళ ను దారుణంగా చితకబాదారు. దీనికి సంబంధించిన వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారి పోవడం తో రాష్ట్రవ్యాప్తంగా ఈ ఘటన సంచలనం గా మారిపోయింది.
బీహార్లోని మాదే పుర లో ఈ దారుణ ఘటన వెలుగు చూసింది. నలుగురు వ్యక్తులు తనపై అత్యాచారానికి ప్రయత్నించగా ప్రతిఘటించింది సదరు మహిళ. ఇక ఇలా ప్రతిఘటించినందుకుగాను సదరు మహిళను పట్టపగలే గ్రామపంచాయతి వద్ద శిక్షించారు. అందరూ చూస్తుండగానే ఆమె చీర లాగేసి అర్థనగ్నంగా ఆమెను నిలబెట్టారు. అంతటితో ఆగకుండా మంటల్లో కాల్చినా వెదురు బొంగులతో ఏకంగా ఆమెను దారుణంగా కొట్టడం కూడా మొదలు పెట్టారు. ఇక ఈ వీడియోలో చూసుకుంటే మృగాల కంటే దారుణంగా వ్యవహరించారు అని అర్థమవుతోంది. చివరికి ఈ వీడియో పోలీసుల కంటపడటంతో దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు..