బందు మిత్రులందరి సమక్షంలో పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది.. ఇక అక్కడికి వచ్చిన బంధుమిత్రులు అందరు నూతన వధూవరులకు ఆశీర్వచనాలు కూడా అందించారు. ఇక పెళ్లి జరిగిన తర్వాత ఓ రోజు నూతన వధూవరులకు శోభనం ఏర్పాటు చేశారు ఇరు కుటుంబ సభ్యులు. ఈ క్రమంలోనే అటు మొదటి రాత్రి రోజు వచ్చే వరుడికి ఊహించని షాక్ తగిలింది. వధువు చెప్పిన నిజం తో వరుడు ఒక్కసారిగా అవాక్కయ్యాడు. దీంతో నాకు భార్య వద్దు అంటూ కోర్టులో పెళ్లి రద్దు చేయాలి అంటూ దరఖాస్తు చేసుకున్నాడు
పెళ్లయిన శోభనం రాత్రి వరుడు అలా కోర్టులో పెళ్లి రద్దు చేయాలి అంటు దరఖాస్తు చేసుకోవడానికి కారణం వధువు తనపై అత్యాచారం జరిగింది అని చెప్పడమే. మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. తొలిరాత్రి వధువు షాకిచ్చింది. గతంలో తనపై మేనమామ కొడుకు అత్యాచారం చేసినట్లు చెప్పడంతో వరుడు షాక్కు గురయ్యాడు. మరునాడు ఉదయం ఆమెను పుట్టింట్లో విడిచిపెట్టి పెళ్లిని రద్దు చేయాలంటూ కోర్టును ఆశ్రయించాడు. అయితే కోర్టు విచారణ చేపట్టగా ఎన్ని సార్లు నోటీసులు ఇచ్చినా సదరు యువతి మాత్రం కోర్టుకు హాజరుకాలేదు. దీంతో మూడేళ్ల తర్వాత పెళ్లిని రద్దు చేస్తూ కోర్టు ఇటీవల తీర్పును ఇచ్చింది..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి