ఎందుకంటే ఇక్కడ ఒక యువకుడు నీళ్లు అనుకొని చివరికి యాసిడ్ తాగాడు. దీంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విజయవాడ నగరంలోని ఎనికేపాడు లో చోటు చేసుకుంది ఈ ఘటన. కృష్ణా జిల్లా నాగాయలంక కు చెందిన చైతన్య విజయవాడ లయోలా కళాశాలలో ఏవియేషన్ విభాగంలో డిగ్రీ చదువుతున్నాడు. ఇక ఇటీవల స్నేహితులతో కలిసి కేసేపల్లి లో గది అద్దెకు తీసుకుని ఉంటున్నాడు చైతన్య..
ఇకపోతే ఇటీవల దాహం వేయడంతో సమీపం లో ఉన్న కూల్ డ్రింక్ షాప్ కి వెళ్లి మంచినీళ్ళ సీసా అడిగాడు. ఈ క్రమంలోనే షాపు యజమాని అక్కడి ఫిడ్జ్ లో ఉంది తీసుకో అంటూ చెప్పాడు. అయితే చైతన్య ఫ్రిడ్జిలో మంచినీరు బాటిల్ పక్కనే ఉన్న యాసిడ్ బాటిల్ తీసుకొని గుటగుట తాగి దాహం తీర్చుకున్నాడు. అయితే అచ్చం మంచినీటి బాటిల్ లాగానే యాసిడ్ బాటిల్ కూడా ఉండడంతో గమనించలేదు. వెంటనే వాంతులు చేసుకున్నాడూ. దీంతో స్నేహితులు సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. యాసీడ్ తాగినట్లు ధ్రువీకరించిన వైద్యులు ఆసుపత్రికి తీసుకోవాలని సూచించడంతో విజయవాడ సూర్యారావుపేట లో ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లగా ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి