ప్రేమించుకోవడం, డేటింగ్ పేరుతో ఇద్దరు కలిసి ఉండటం ఈరోజుల్లో కామన్ అయిపోయింది..అలా చాలా మంది వారి అవసరాలకు తగ్గట్లు ఉంటున్నారు.అయితే ఇప్పుడు ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.వారిద్దరు ప్రేమించుకున్నారు.ఒకే ఇంట్లో సహజీవనం చేస్తున్నారు.కొన్ని రోజుల తర్వాత ప్రేయసిపై ప్రియుడికి అనుమానం మొదలైంది.. ఆమె మరొక యువకుడితో సన్నిహితంగా మెలగడాన్ని తట్టుకోలేకపోయాడు..ఆ యువకుడిని తన ఇంటికి పిలిపించి హత్య చేశాడు.. ప్రేయసి సహాయంతో మృతదేహాన్ని ఇంటి ఆవరణలోనే గొయ్యి తీసి, ఉప్పు వేసి మరీ పూడ్చిపెట్టాడు.. ఏడు నెలల తర్వాత పక్కింటి వారిని బెదిరించే క్రమంలో తనంతట తనే పోలీసులకు దొరికిపోయాడు.


ఈ షాకింగ్ ఘటన మధ్య ప్రదేశ్ లో వెలుగు చూసింది.. వివరాల్లొకి వెళితే..మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు సమీపంలో ఈ ఘటన జరిగింది.హబీబ్‌గంజ్ ప్రాంతానికి చెందిన షంషేర్ అలియాస్ బబ్బూ, ఆశా ఠాకూర్ అనే మహిళ కొద్ది రోజులుగా ఒకే ఇంట్లో సహజీవనం చేస్తున్నారు. కొన్ని రోజుల తర్వాత శివదత్‌ అనే యువకుడితో ఆశ సన్నిహితంగా ఉంటోందని బబ్బూకు అనుమానం మొదలైంది. శివదత్‌తో ముడిపెడుతూ ఆశను రోజూ వేధించేవాడు. ఆశ ఎంత చెప్పినా వినేవాడు కాదు. చివరకు శివదత్‌ను చంపాలని నిర్ణయించుకుని ఆశను సహాయం అడిగాడు. చేసేదేం లేక ఆశ సరేనంది. ఏడు నెలల క్రితం తన ఇంట్లో పార్టీ అని చెప్పి శివదత్‌ను బబ్బూ ఆహ్వానించాడు. ఇద్దరూ ముందుగా మద్యం సేవించారు. శివ మైకంలోకి వెళ్లాక బబ్బూ కత్తితో అతడి ఛాతిపై పొడిచి చంపేశాడు.ఆ తర్వాత బబ్బూ, ఆశ కలిసి ఇంటి ఆవరణలో అడుగు లోతు గొయ్యి తవ్వారు. దానిలో ఉప్పు వేసి శివ మృతదేహాన్ని లోపల వేసి పూడ్చేశారు. తాజాగా పక్కింటి వారితో బబ్బూకు గొడవ జరిగింది. దీంతో సోమవారం బాగా మద్యం సేవించిన బబ్బూ ఇంటి ఆవరణలో పూడ్చిన శివ పుర్రెను తీసుకుని బయటకు వెళ్లాడు. తనతో పెట్టుకుంటే శివలాగే నిన్ను చంపేస్తానని పక్కింటి మహిళను బెదిరించాడు.దాంతో ఆ మహిళ భయపడి పోలీసులకు సమాచారం అందించింది.కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికి తీశారు. బట్టల ఆధారంగా ఆ మృతదేహం శివదేనని అతని తండ్రి గుర్తించారు. మృతదేహానికి డీఎన్‌ఏ టెస్ట్ కూడా నిర్వహించనున్నారు..ప్రస్తుతం ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: