ఏకంగా వారి జీవితాల్లో ఊహించని వ్యాధులను తీసుకొచ్చి పెట్టి జీవితాన్ని దినదినగండంగా మార్చేసింది. ఈ హృదయ విదారక పరిస్థితి ఎదుర్కొంటున్న ఆ కుటుంబం గురించిన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. భీమిలి మండలం మజ్జివలస పంచాయితీ కాగితాల పేటలో చెందిన గురు నాయుడు కుటుంబం ఉంటుంది. అయితే క్వారీలో కార్మికుడిగా పనిచేస్తూ భార్య విజయలక్ష్మి, కుమారుడు అఖిల్ కుమార్,కూతురు లాస్యను ఉన్నంతలో బాగానే చూసుకుంటున్నాడు గురు నాయుడు.
అయితే గురు నాయుడు కు ఎలాంటి వ్యసనాలు లేవు అని చెప్పాలి. ఇక కుటుంబ బాధ్యతలను ఎంతో చక్కగా నిర్వహించేవాడు. అయితే ఇటీవలే ఏడాదిన్నర క్రితమే కూతురుకు మధుమేహం ఉన్నట్లు నిర్ధారణ అయింది. ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్తే లక్ష రూపాయలు అవుతుంది అని చెప్పడంతో అంతటి ఆర్థిక పరిస్థితి లేని గురు నాయుడు కేజీహెచ్ లో చేర్పించి చికిత్స అందిస్తున్నాడు. కొడుకు అఖిల్ కుమార్ పలుమార్లు ఆకస్మాత్తుగా కిందపడిపోయాడు. చేతులు వంకర తిరిగి పోయాయ్. ఇక పనికి సహకరించకుండా మారిపోయాయి. ఇక గత ఏడాది ఈ జ్వరం బారిన పడ్డ గురు నాయుడు పరీక్షలు నిర్వహించగా చివరికి బ్లడ్ క్యాన్సర్ మూడో దశలో ఉన్నట్లు వైద్యులు తెలిపారు. దీంతో అతని గుండె ఆగినంత పని అయ్యింది. దీంతో ఆ కుటుంబం దినదినగండంగా గడుపుతుంది. గురు నాయుడు పనికి వెళ్లకపోవడం దానికితోడు ఇక చికిత్సకు సంబంధించిన ఖర్చులతో ఆ కుటుంబంతీవ్ర ఇబ్బందుల్లో కూరుకుపోయింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి