సాధారణంగా మనం ఎక్కువగా సినిమాల్లో చూస్తూ ఉంటాం . రాత్రి ఎంతో సంతోషంగా గడిపి భోజనం చేసి హాయిగా పడుకున్న వారు ఉదయం లేచేసరికిశవమై పోతూ ఉంటారు. ఇక కొన్ని కొన్నిసార్లు సాధారణ మరణం సంభవిస్తే మరికొన్నిసార్లు హత్యలు చేశారు అంటూ ట్విస్ట్  తెరమీదికి వస్తూ ఉంటుంది. ఇక ఇటీవల కాలంలో మారిపోతున్న మనుషుల పుణ్యమా అని ఇలాంటి ఘటనలు నిజజీవితంలో కూడా జరుగుతూ ఉన్నాయి. కుళ్లు కుతంత్రాలు కక్షలు పగలతో రగిలి పోతున్న మనుషులు  ఇక ఎప్పుడూ ప్రాణాలు తీస్తున్నారో కూడా తెలియని పరిస్థితి. దీంతో రాత్రి పడుకున్నాక ఉదయం నిద్రలేచే వరకు  ప్రాణాలు ఉంటాయా లేవా అన్నది కూడా గ్యారెంటీగా చెప్పలేని పరిస్థితి.


 ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది అని చెప్పాలి.  ఆ తండ్రీ కొడుకులు  ఎంతో ఆనందంగా గడిపారు. రాత్రి భోజనం చేసి పడుకున్నారు తండ్రి కొడుకులు. హాయిగా చల్లటి గాలికి  వరండాలో నిద్రపోయారు. కానీ ఉదయం లేచేసరికి ఊహించని ట్విస్ట్. తెల్లారేసరికి ముగ్గురు కూడా అచేతనంగా పడి ఉన్నారు. దీంతో వీరి మృతి కాస్త ఒక మిస్టరీ గా మారిపోయింది అని చెప్పాలి. ఈ ఘటన ఛత్తీస్గఢ్లోని జాగూర్ గ్రామంలో వెలుగులోకి వచ్చింది. బొమ్మ మాద్వి అనే వ్యక్తి రోజువారి కూలి పనులు చేస్తూ కుటుంబ పోషణ చూసుకుంటున్నాడు.


 అతనికి ఇద్దరు కుమారులు ఉన్నారు.. అయితే రాత్రి తండ్రి కుమారులు అందరూ కూడా ఇంట్లో ఎంతో ఆనందంగా గడిపారు. అందరు కలిసి భోజనం చేసి ఇక హాయిగా నిద్ర పోయారు. రాత్రి సమయంలో వారికి ఆరోగ్య సమస్యలు కూడా ఏమీ లేవు. కానీ మరుసటి రోజు తెల్లారేసరికి ముగ్గురు అచేతన స్థితిలో ప్రాణాలు కోల్పోయి శవాలుగా పడి ఉన్నారు. ఈ క్రమంలోనే బంధువులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే ముగ్గురు ఎలా మరణించారు ఉన్నది ఒక మిస్టరీగా మారిపోయింది. ఇక ఈ కేసును ప్రత్యేకంగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి: