ఇటీవలి కాలంలో మనుషుల్లో పూర్తిగా మానవత్వం కనుమరుగైపోతుంది అన్న దానికి నిదర్శనంగా ఎన్నో ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. సాటి మనుషుల విషయంలో కాస్తయినా జాలి దయ చూపించకుండా దారుణంగా వ్యవహరిస్తున్నారు ఎంతోమంది. ఇలా ఇటీవలి కాలంలో డబ్బుల కోసం ఆస్తుల కోసం సొంత వాళ్లని హతమారుస్తూ ఉన్న పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఇటీవలి కాలంలో దొంగలు రెచ్చిపోతున్నారు. కుదిరితే ఎవరికీ కనిపించకుండా రహస్యంగా దొంగతనానికి చేయడానికి ప్రయత్నిస్తున్నారు.


 లేదంటే ఏకంగా ప్రాణాలను తీసి మరీ దోచుకోవడానికి కూడా వెనకడుగు వేయడం లేదు. ఇక్కడ రోజురోజుకి కొత్త కొత్త పద్ధతుల్లో చోరీలకు పాల్పడుతు అత్యంత క్రూరంగా ప్రవర్తిస్తున్న ఘటనలో ప్రతి ఒక్కరిని భయాందోళనకు గురి చేస్తున్నాయని చెప్పాలి. సాధారణంగా దొంగలు అంటే వేధింపులకు పాల్పడి దొంగతనాలు చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం ఏకంగా చోరీ చేయడం కోసం ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడడం లేదు అని చెప్పాలి. ఈ భయానక ఘటన న్యూయార్క్ లో వెలుగులోకి వచ్చింది. న్యూయార్క్ పోలీసు విభాగం ట్విట్టర్లో ఇందుకు సంబంధించిన వీడియోస్ షేర్ చేయగా వైరల్ గా మారింది.


 ఇక ఈ వీడియోలో చూసుకుంటే ఒక వ్యక్తి సాధారణంగా రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఇలాంటి సమయంలోనే వెనుక నుంచి వేగంగా వచ్చిన ఒక కారు అతన్ని ఢీ కొడుతుంది. దీంతో గాల్లో ఎగిరి దూరంగా పడిపోతాడు సదరు వ్యక్తి. గాయాల కారణంగా పైకి లేవలేక పోతాడు. అయితే ఇక పొరపాటున ఈ యాక్సిడెంట్ జరిగింది అని అందరూ అనుకుంటారు. కానీ ఆ తర్వాత కారులో ఉన్న వ్యక్తులు గాయాలతో పడి ఉన్న వ్యక్తి దగ్గరకు వెళ్లి డబ్బులతో పాటు ఆభరణాలు చోరీ చేసి వెళ్తారు. ఇదంతా సీసీ కెమెరాల్లో రికార్డయింది. కాగా ప్రస్తుతం బాధితుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: