ఇటీవలి కాలంలో ఎంతోమంది మోసగాళ్లు జనాలను మోసం చేయడానికి.. డబ్బులు దోచుకోవడానికి  ఉన్న ఏ మార్గాన్ని కూడా వదలడం లేదు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవల కాలంలో కొంతమంది కేటుగాళ్లు మోసాలకు పాల్పడేందుకు ఎంచుకుంటున్న దారులు ప్రతి ఒక్కరిని అవాక్కయ్యేలా చేస్తున్నాయి అని చెప్పాలి. ఎక్కడ ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా ఎంతో చాకచక్యంగా మోసాలకు పాల్పడుతూ పోలీసులకు సవాల్ విసురుతూ ఉన్నారు కేటుగాళ్లు. వెరసి నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూసిన తర్వాత ఏది నిజమో ఏది అబద్దమో కూడా నమ్మలేని పరిస్థితి నెలకొంది అని చెప్పాలి.


 ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. సాధారణంగా ఇప్పటివరకూ కరెన్సీ నోట్లు లాగానే అచ్చం నకిలీ నోట్లు ముద్రించి జనాలను మోసం చేయడం లాంటి ఘటనల గురించి తెలుసుకున్నాం. ఇక అంతా కష్టపడటం ఎందుకు కాస్త సులభమైన దారి వెతికితే బాగుంటుంది కదా అనుకున్నారో ఏమో కలర్ జిరాక్స్ మిషన్ ద్వారా పని కానిచ్చేశారు. కలర్ జిరాక్స్ తో నకిలీ కరెన్సీ నోట్లు తయారుచేసి చలామణికి ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన స్థానికంగా మారిపోయింది.  ఈ ఘటనలో అరెస్టయినవారిలో మహారాష్ట్రకు చెందిన ఇరవై ఏడేళ్ల సయ్యద్ ఆన్సర్ హైదరాబాదుకు చెందిన 33 ఏళ్ల షేక్ ఇమ్రాన్ ఉన్నారు.


 అయితే వీరి దగ్గర నుంచి 2.50 లక్షల విలువైన కరెన్సీ నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకోవడం గమనార్హం.  కర్ణాటకలోని ఓ ప్రాంతంలో జిరాక్స్ సెంటర్ నిర్వహిస్తున్నాడు షాకీర్. ఇటీవలే కలర్ ప్రింటర్ తో నకిలీ కరెన్సీ నోట్లు ముద్రించారడు. ఇక వాటిని మార్చేందుకు తన బంధువు మహారాష్ట్ర లాతూర్ కు చెందిన సయ్యద్ ఆన్సర్ ను సంప్రదించాడు.  8000 అసలు  నోట్లకు 50 వేలు డబ్బులు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవల మహాత్మా గాంధీ బస్ స్టాండ్ అవుట్ గేట్ వద్ద కరెన్సీ మార్పిడి చేసుకుంటుండగా టాస్క్ఫోర్స్ అధికారులు పోలీసులు ఒక్కసారి అక్కడికి చేరుకొని నిందితులను అరెస్టు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: