మొన్నటి వరకు బంధాలు బంధుత్వాలు అంటే ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధపడిన మనిషి ఇక ఇప్పుడు మనీ కోసం అలాంటి బంధాలు బంధుత్వాలను తెంచుకోవడానికి కూడా సిద్ధమవుతున్నాడు. అంతే కాదు సొంత వారిని దారుణంగా హత్య చేయడానికి కూడా రెడీ అవుతున్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే కట్టుకున్న వారు కన్నవారు కడుపున పుట్టిన వారు అనే తేడా లేకుండా ఆస్తుల కోసం ఎన్నో దారుణమైన పనులు చేస్తున్న ఘటనలో నేటి రోజుల్లో వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఇలాంటి తరహా ఘటనలు ప్రతి ఒక్కరిని కూడా ఉలిక్కిపడేలా చేస్తూ ఉన్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.


 ముఖ్యంగా భార్యాభర్తల బంధం అంటే అన్యోన్యతకు కేరాఫ్ అడ్రస్ గా ఉండాలి. కానీ ఇటీవల కాలంలో మాత్రం భార్యాభర్తల బంధం లో ఇలాంటి అన్యోన్యత ఎక్కడా కనిపించడం లేదు అని చెప్పాలి. భార్య భర్తలు కాస్త ఏకంగా ఒకరిని ఒకరు దారుణంగా చంపుకునే బద్ధ శత్రువులుగా మారిపోతున్నారు. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. తన మెడలో మూడు ముళ్ళు వేసి తాళి కట్టిన భర్త గొంతుకు తాడు బిగించి చంపేసింది  ఇక్కడ ఒక భార్య. అయితే కూతుర్లు సైతం మానవత్వాన్ని మరిచిపోయి ఇక తండ్రిని చంపేందుకు తల్లికి సహకరించడం గమనార్హం.


 ఈ ఘటన మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలో వెలుగులోకి వచ్చింది. సీతానగరం గ్రామానికి చెందిన లంగడి బాలయ్య అనే కిసనమ్మ భార్యాభర్తలు. వీరికి రాధమ్మ, వినోద అనే కూతుర్లు ఉన్నారు. వీరికి కొడుకు మల్లేష్ ఉండగా ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. అయితే ఇద్దరు కూతుర్లను. గ్రామానికి చెందిన వారికి ఇచ్చి పెళ్లి చేశారు. కాగా ఇటీవలే బాలయ్యను  ఇంట్లో సరిగ్గా చూసుకోక పోవడంతో మద్యం సేవిస్తూ అప్పుడప్పుడు చిల్లర దొంగతనాలకు చేయడం మొదలుపెట్టాడు. ఇకపోతే ఇటీవల బాలయ్య ట్రాక్టర్ అద్దెకు తీసుకుని నడుపుతూ ఉండగా యాక్సిడెంట్ అయింది. దీంతో ఇద్దరు యువకులు మృతి చెందగా 2.5 లక్షలు పరిహారం చెల్లించారు బాలయ్య కుటుంబం. అప్పటినుంచి ఇక వారి ఇంట్లో గొడవలు ప్రారంభమయ్యాయి. ఇక ఇటీవలే మరోసారి గొడవ కావడంతో భార్య కిసనమ్మ భర్త గొంతుకు తాడు బిగించగా మనవడు దుర్గేష్ కూతుర్లు రాధమ్మ వినోదాలు సహకరించారు. ఈ క్రమంలోనే బాలయ్య తప్పించుకోవడానికి ఎంతో ప్రయత్నిస్తూ విలవిలలాడుతూ చనిపోయాడు అని చెప్పాలి.  ఇక మృతదేహాన్ని ఇంట్లోకి తీసుకెళ్లి పడేశారు. అయితే ఈ ఘటన కాస్త స్థానికంగా సంచలనంగా మారింది. అయితే అమాయకుడైన బాలయ్యను చంపిన కుటుంబీకులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతూ ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: