
కానీ రోజురోజుకి దుర్వాసన ఎక్కువ కావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ క్రమంలోనే పోలీసులు వెళ్లి చూడగా మంచానికి అతుక్కుపోయి ఉన్న మృతదేహం కనిపించింది. ఇది చూసి అధికారులు సైతం కంగుతిన్నారు అని చెప్పాలి. ఉత్తరప్రదేశ్ లోని ఆదాయపన్ను శాఖలో విమలేష్ దీక్షిత్ అనే వ్యక్తి పని చేస్తూ ఉండేవాడు. అయితే గత ఏడాది ఏప్రిల్ 22వ తేదీన అకస్మాత్తుగా అనారోగ్యంతో మరణించాడు. ఇందుకు సంబంధించి ఓ ప్రైవేట్ ఆస్పత్రి మరణ ధ్రువీకరణ పత్రాన్ని కూడా జారీ చేసింది.
ఈ సమయంలోనే అతని మృతదేహాన్ని ఇంటికి తీసుకు వెళ్లిన కుటుంబ సభ్యులు అంత్యక్రియలకు ఏర్పాటు చేశారు. కానీ అలాంటి సమయంలో అతనిలో కదలికలు కనిపించాయని అతను కోమాలో ఉన్నాడని సభ్యులు అనుకున్నారు. ఇంకేముంది మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లి బెడ్ పై పడుకోబెట్టి ఇక కోమాలో నుంచి బయటికి వస్తాడు అని ఎదురు చూడటం మొదలుపెట్టారు. అయితే మృతుడి భార్య మానసిక పరిస్థితి బాగా లేకపోవడం గమనార్హం. అందుకే ప్రతిరోజు గంగాజలాన్ని చల్లి త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ ఉండేది. ఇక ఆక్సిజన్ సిలిండర్లు తీసుకువచ్చి మృతదేహానికి ఆక్సిజన్ కూడా పెట్టేవారు. అయితే ఇటీవలే ఇరుగుపొరుగు వారు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించడంతో వాళ్లు వచ్చి చూడగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.