
ఇలాంటి హత్యోదంతాలు కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వెలుగులోకి వస్తూ సభ్య సమాజాన్ని ఉలిక్కి పడేలా చేస్తూ ఉన్నాయని చెప్పాలి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగు చూసింది. పశ్చిమ బెంగాల్లోని సిలిగుడిలో ఏకంగా 10 రూపాయలు ఇవ్వమని గొడవ పడిన స్నేహితుడిని ఓ యువకుడు దారుణంగా బండరాయితో కొట్టి చంపేశాడు. వైకుంటపూర్ అడవిలో ఈ ఘటన వెలుగు చూసింది అని చెప్పాలి. అయితే మృతుడు రాంప్రసాద్ సహాగా గుర్తించారు పోలీసులు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టి ఇక నిందితులని అదుపులోకి తీసుకున్నారు అని చెప్పాలి.
రాంప్రసాద్ అనే 20 ఏళ్ల యువకుడు మత్తుపదార్థాలకు బానిసగా మారిపోయాడు. ఈ క్రమంలోనే స్నేహితులతో కలిసి తరచూ అడవికి వెళ్లి ఇక గంజాయిని కొనుగోలు చేయడం చేస్తూ ఉండేవాడు. ఈ క్రమంలోనే ఇటీవల సుభ్రత దాస్, అజయ్ రాయ్ అనే ఇద్దరు స్నేహితులతో కలిసి వైకుంటపూర్ ఫారెస్ట్కు వెళ్లి మత్తు పదార్థాలను ఎప్పటిలాగే కొనుగోలు చేశాడు. అయితే తనకు ఇంకా గంజాయి కావాలని కొనుగోలు చేసేందుకు ₹10 ఇవ్వాలంటూ రాంప్రసాద్ సుభ్రత దాసును అడిగాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలోనే మాట మాట పెరిగిపోవడంతో కోపంతో ఊగిపోయిన సుభ్రత దాస్ బండరాయితో రాంప్రసాద్ను కొట్టి చంపేశాడు. ఆ తర్వాత అడవి నుంచి పారిపోయారు ఇద్దరు స్నేహితులు. అయితే ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరు నిందితులని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు అని చెప్పాలి.