ఈ మధ్యకాలంలో ఎందుకో గాని మనుషులు ఎందుకో మనుషుల్లా మాత్రం ప్రవర్తించడం లేదు. అడవుల్లో ఉంటే మృగాల కంటే దారుణంగా ప్రవర్తిస్తూ ఉన్న ఘటనలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఇక వెరసి ఇలాంటి తరహా ఘటనలు రోజురోజుకీ సంచలనంగా మారిపోతూ ఉన్నాయి. సభ్య సమాజంలో ప్రతి ఒక్కరికి భద్రతకు  ప్రమాదం ఏర్పడుతుంది అన్న విషయాన్ని అందరికీ అర్థం అయ్యేలా చేస్తూ ఉన్నాయి. ఇక్కడ వెలుగులోకి వచ్చిన ఘటన అయితే మరింత దారుణమైనది. ఇన్నాళ్ల వరకు మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయి అన్న విషయం గురించి అందరూ మాట్లాడుకోవడం చూశాము.


 ఆడపిల్ల ఒంటరిగా కనిపించింది అంటే చాలు మగాళ్లు మృగాలుగా మారిపోయి దారుణంగా అత్యాచారాలకు పాల్పడుతున్నారు. కొన్ని కొన్ని సార్లు పక్కన కుటుంబ సభ్యులు ఉన్నా వెనకడుగు వేయకుండా వారిపై దాడి చేసి మరి దారుణంగా అత్యాచారాలు చేస్తున్న ఘటనలు వెలుగులోకి వచ్చాయి. దీంతో ఆడపిల్ల భద్రత రోజురోజుకు ప్రశ్నార్థకంగా  మారిపోతుంది అని చెప్పాలి. అయితే కోర్టులు నిందితులను కఠినంగా శిక్షిస్తున్నప్పటికీ కామాంధుల తీరులో మాత్రం మార్పు రావడం లేదు అని చెప్పాలి. ఇన్నాళ్లు అమ్మాయిలపై అఘాయిత్యం చేయడం గురించి విన్నాము. కానీ ఇక్కడ మరింత దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది.



 ఏకంగా 19 ఏళ్ల యువకుడి పై మరో ఇద్దరు యువకులు దారుణంగా లైంగిక దాడికి పాల్పడిన ఘటన సంచలనగా మారిపోయింది. జగిత్యాలలోని కోరుట్లలో ఈ దారుణం జరిగింది. పట్టణానికి చెందిన యువకుడిని నజీర్, ఉమార్ మభ్యపెట్టి ద్విచక్ర వాహనంపై అడవిలోకి తీసుకువెళ్లారు. అక్కడ అతనిపై లైంగిక దాడికి పాల్పడ్డారు. అయితే బాధితుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన కాస్త స్థానికంగా సంచలనంగా మారిపోయింది. అయితే ఏకంగా మగాళ్లపై కూడా అత్యాచారం జరుగుతున్న పరిస్థితులు చూస్తుంటే.. మనుషులు ఎంత దారుణంగా మారిపోయారో అర్థమవుతుందని ఎంతోమంది అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: