అయితే మరి ముఖ్యంగా దాంపత్య బంధానికి విలువ ఇవ్వని ఎంతోమంది అక్రమ సంబంధాల పేరుతో చివరికి కట్టుకున్న వారిని కడతేరుస్తున్న ఘటనలు కోకోళ్లలుగా మారిపోయాయి. దీంతో ఇదంతా చూసిన తర్వాత పెళ్లి చేసుకుంటే ఇంతటి దారుణమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందా.. అని ప్రతి ఒక్క యువతి యువకులలో ఆలోచన వస్తుంది అనడంలోనూ సందేహం లేదు. ఇక్కడ వెలుగులోకి వచ్చిన ఘటన అయితే మరింత విచిత్రమైనది అని చెప్పాలి. భర్త ఏదో కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. అయితే భర్తను విడిపించేందుకు భార్య ఎంతో కష్టపడింది.
చివరికి భర్తకు బెయిల్ ఇప్పించి ఇక బయటికి తీసుకువచ్చింది. అయితే ఇలా జైలు నుంచి బయటికి వచ్చిన భర్త చివరికి భార్యని చంపేసాడు. వినడానికే షాకింగ్ గా ఉంది కదా. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోనికి బరేలీలో జరిగింది. అప్పటికే హత్య కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్నాడు భర్త కృష్ణ పాల్. ఇటీవల భార్య పూజ అతనికి బ్రెయిన్ ఇప్పించింది. అయితే బయటికి వచ్చిన కృష్ణ పాల్ తన భార్యకు మున్న అనే వ్యక్తితో అక్రమ సంబంధం ఉంది అని అనుమానంతో ఇద్దరిపై కాల్పులు జరిపాడు. అయితే ఈ ఘటనలో భార్య తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. మున్నా గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. తర్వాత నిందితుడు కృష్ణపాల్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. భార్యను చంపినందుకు బాధపడట్లేదు అంటూ స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి