ఇలా ఇటీవల కాలం లో ప్రయాణికుల నిర్లక్ష్యం చివరికి వారి ప్రాణాల మీదికి తెస్తున్న ఘటనలు రోజు రోజుకు ఎక్కువై పోతున్నాయి అని చెప్పాలి. ఇక ఇటీవల ఒక 17 ఏళ్ల యువకుడు కూడా ప్లాట్ఫామ్ అంచున నిలబడి నిర్లక్ష్యం గా వ్యవహరించి చివరికి ప్రాణాలు కోల్పోయాడు. ఫ్లాట్ ఫామ్ అంచున యువకుడు నిలబడగా.. వెనకనుంచి దూసుకు వచ్చిన రైలు అతని బలంగా ఢీకొట్టింది. దీంతో రెప్పపాటు కాలం లో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన ముంబై లోని మలాడు రైల్వేస్టేషన్లో జరిగింది అని చెప్పాలి.
రైల్వే ప్లాట్ ఫామ్ అంచును నిలబడి లంచ్ బాక్స్ కడుగుతున్నాడు ఒక విద్యార్థి.. అయితే పక్కనే ఉన్న అతడి స్నేహితుడు మయాంక్ అక్కడికి వచ్చి మంచినీళ్ల బాటిల్ అందుకొని తాగుబోయాడు. ఇక ఇంతలోనే వెనుక నుంచి మెరుపు వేగంతో దూసుకు వచ్చిన లోకల్ రైలు.. అతడిని బలంగా ఢీకొట్టింది. దీంతో ఆమడ దూరంలో వెళ్లి పడిపోయాడు. చివరికి రెప్పపాటు కాలంలో అతని ప్రాణాలు కూడా గాల్లో కలిసి పోయాయి. ఇందుకు సంబంధించిన వీడియో ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. అయితే ప్రయాణికులందరూ రైల్వే ప్లాట్ఫామ్ పై ఎప్పుడు అప్రమత్తంగా ఉండాలి అంటూ రైల్వే అధికారులు సూచిస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి