
ఇంకేముంది వారిని చూసి ఏనుగు కి కోపం నషాలానికీ అంటింది. దీంతో ఏకంగా ప్రాణాలు తీసేందుకు వారి వెంట పరుగులు పట్టింది. దీంతో ఇలా ఏనుగు పట్ల అతిగా ప్రవర్తించిన వారికి చుక్కలు కనిపించాయ్ అని చెప్పాలి. ఇలా ఏనుగుల నుంచి తప్పించుకోవడానికి పరుగులు పెడుతూ చివరికి తృటిలో ప్రాణాలను కాపాడుకున్నారు అని చెప్పాలి. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. లకింపూర్ ఖేరి జిల్లా నుంచి ముగ్గురు వ్యక్తులు నేపాల్ కు వెళ్తున్నారు.
ఈ క్రమం లోనే ద్విత్వా టైగర్ రిజర్వ్ నుంచి వెళ్తుండగా.. అక్కడ ఒక భారీ ఏనుగుల గుంపు కనిపించింది. ఇంకేముంది ఆ ఏనుగుల గుంపును ఫోటోలో బంధించాలి అనుకున్నారు సదరు వ్యక్తులు. ఇక ఏనుగులకు కాస్త దగ్గరగా వెళ్లి సెల్ఫీలు తీసుకోవడం మొదలుపెట్టారు అయితే వాళ్ళు ఇలా చేయడం వల్ల ఏనుగుల ప్రైవసీ దెబ్బతింది. దీంతో వాటికి చిర్రేత్తుకొచ్చింది. ఇంకేముంది వెనక ముందు ఆలోచించకుండా సెల్ఫీలు తీసుకుంటూ డిస్టర్బ్ చేసిన వారి మీదకి దూసుకు వచ్చాయి. వెంటనే వనికిపోయి భయంతో ముగ్గురు వ్యక్తులు రోడ్డుపై పరుగులు పెట్టాడు.