నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తుంటే ఈ సభ్య సమాజంలో బ్రతుకుతుంది మనుషులా లేకపోతే మనుషుల రూపంలో ఉన్న మానవ మృగాల అన్నది కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది అని చెప్పాలి. ఎందుకంటే ఒకప్పుడు నేను నా ఫ్యామిలీ బాగుంటే చాలు ఎవరు ఎటు పోతే మాకెందుకు అని స్వార్ధంగా ఆలోచించేవాడు మనిషి. కానీ ఆ స్వార్థం మనిషిలో మరింత పెరిగిపోయింది. నేను బాగుంటే సరిపోతుంది నా ఫ్యామిలీ ఎటు పోతే నాకెందుకు అన్నట్లుగా మనిషిని ఆలోచన తీరు మారిపోయింది. దీంతో సొంత వారి ప్రాణాలకు కూడా కాస్తయినా విలువ ఇవ్వడం లేదు మనిషి.


 బంధాలకు బంధుత్వాలకు విలువ ఇవ్వకుండా అడవుల్లో ఉండే మృగాల కంటే మరింత క్రూరంగా మారిపోతున్న మనిషి చివరికి సొంత వారి ప్రాణాలు తీయడానికి కూడా వెనకడుగు వేయని పరిస్థితి కనిపిస్తుంది. ఏకంగా చాక్లెట్ తిన్నంత ఈజీగా ప్రాణాలను గాల్లో కలిపేస్తున్నారు. రక్తం పంచుకొని పుట్టిన పిల్లల విషయంలో కూడా కనీసం మానవత్వాన్ని చూపించడం లేదు అని చెప్పాలి. ఇక్కడ వెలుగులోకి వచ్చిన ఘటన కూడా ఈకోవలోకి చెందినదే. ఏకంగా భార్య మీద కోపంతో అభం శుభం తెలియని కన్నకూతురు ఉసురు తీసుకున్నాడు ఇక్కడ ఒక తండ్రి.


 ఈ ఘటన స్థానికులు అందరిని కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. ఈ దారుణం ఎక్కడో కాదు హైదరాబాద్ నగరంలో వెలుగులోకి వచ్చింది. చంద్రశేఖర్ అనే వ్యక్తికి  హేమ అనే మహిళతో 12 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. అయితే ఏడాది క్రితం అతని ఉద్యోగం పోయింది. దీంతో భార్యాభర్తల మధ్య ఆర్థిక సమస్యల కారణంగా విభేదాలు వచ్చాయి. అయితే భార్య కూతురు మోక్షాజ్ఞను తీసుకొని పుట్టింటికి వెళ్ళిపోయింది. ఇక భార్యపై కక్ష పెంచుకున్న చంద్రశేఖర్ స్కూల్లో ఉన్న కూతురికి మాయమాటలు చెప్పి తనతో పాటు తీసుకెళ్లాడు. చందానగర్లో గొంతు కోసి హత్య చేశాడు. అయితే ఇక ఈ హత్యను ప్రమాదంగా చిత్రీకరించేందుకు  ఓ ఆర్ ఆర్ వైపు వెళ్లి చివరికి అబ్దుల్లా మెట్ పోలీసులకు దొరికిపోయాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: