ఇటీవల కాలంలో సభ్య సమాజంలో దారుణమైన హత్యలు తరచూ వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. చిన్నచిన్న గొడవలకు ఏకంగా మనిషి ప్రాణాలను  తీయడానికి మరో మనిషి ఎక్కడ వెనకడుగు వేయడం లేదు. వెరసి ఇలాంటి తరహా ఘటనలు ప్రతి ఒక్కరిని కూడా ఉలిక్కిపడేలా చేస్తూ ఉన్నాయని చెప్పాలి. అయితే ఇలా చిన్నచిన్న కారణాలకే ఒక వ్యక్తి మరో వ్యక్తిని దారుణంగా హత్య చేయడం లాంటి ఘటనలు గురించి ఇప్పటివరకు చాలా విన్నాం.. చూశాం కూడా. కానీ ఒక వ్యక్తి తనపై తానే హత్యాయత్నం చేసుకోవడం గురించి ఎప్పుడైనా విన్నారా.. అదేంటి వినడానికి ఇదేదో కొత్తగా ఉంది. ఒక వ్యక్తి తనపై తానే హత్యాయత్నం చేసుకోవడం ఏంటి అనుకుంటున్నారు కదా.. అయితే తెలంగాణలో ఒక వ్యక్తి ఇలాగే తనపై తానే హత్యాయత్నం చేసుకున్నాడు. చివరికి పోలీసులను కూడా ఆశ్రయించాడు. ఇక పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపడితే.. అందరూ అవాక్కాయ్యే నిజాలు బయటపడ్డాయ్. ఎందుకంటే ఇలా హత్యయత్నం జరిగింది అంటూ కంప్లైంట్ చేసిన వ్యక్తి తనపై తానే హత్యాయత్నం చేసుకున్నాడని విచారణలో తేలింది. దీంతో పోలీసులు అతనికి షాక్ ఇచ్చారు. అతనిపైనే రిటర్న్ కేస్ పెట్టారు. కాగా ప్రస్తుతం ఆ వ్యక్తి బిజెపి నేతగా ఉండడం గమనార్హం. ఈ ఘటన ఎక్కడో కాదు హైదరాబాద్ నగరంలో వెలుగులోకి వచ్చింది. భాస్కర్ గౌడ్ అనే వ్యక్తి ఇటీవల ఉప్పల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. తనపై కొందరు వ్యక్తులు హత్యాయత్నం చేశారు అంటూ కంప్లైంట్ చేశాడు.


 తనకు సెక్యూరిటీని ఇవ్వాలి అంటూ రిక్వెస్ట్ చేసుకున్నాడు. అయితే పోలీస్ విచారణలో అతని అసలు బండారం బయటపడింది. బోడుప్పల్లో నివాసముండే భాస్కర్ గౌడ్ అనే వ్యక్తి సినీ నిర్మాతగాను,  బిజెపి హిందీ ప్రచార కమిటీ లోను పనిచేస్తున్నాడని పోలీసులు తెలిపారు. అయితే సమాజంలో తనకంటూ ఒక గుర్తింపు పలుకుబడి రావాలని.. ఇలా తనపై హత్య ప్లాన్ చేసుకున్నాడని ఇక పోలీసులు విచారణలో తేల్చినట్లు చెప్పుకొచ్చారు. గన్ మెన్లు ఉంటే సమాజంలో గౌరవిస్తుందని భావించి దురుద్దేశంతో ఇలా తనపై తానే హత్యాయత్నం చేసుకున్నట్లుగా నాటకం ఆడాడు అన్న విషయాన్ని గుర్తించినట్లు చెప్పుకొచ్చారు పోలీసులు. భాస్కర్ గౌడ్ తో పాటు అతని ప్లాన్ లో భాగం పంచుకున్న మరో అరుగుల్ని కూడా అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వారి దగ్గర నుంచి ఇనోవా కారు రెండు బైకులు 2 లక్షల నగలు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: