
మరియాదాస్ హత్య తర్వాత అమృత తల్లిదండ్రులకు ఫోన్ చేసి, తాను భార్యను చంపిన విషయం తెలిపాడు. ఈ సమాచారంతో షాక్‌కు గురైన అమృత తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా సరూర్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. హత్యకు గల కారణాలను లోతుగా విచారిస్తున్నామని, మరియాదాస్‌ను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. అమృత మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.
వివాహేతర సంబంధం ఆరోపణలు ఈ దంపతుల మధ్య తీవ్ర విభేదాలకు కారణమయ్యాయని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ గొడవలు రోజురోజుకూ తీవ్రమవుతూ, చివరకు హత్యకు దారితీశాయని వారు తెలిపారు. స్థానికులు ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేస్తూ, కుటుంబ వివాదాలు ఇంత దారుణ పరిణామాలకు దారితీయడం బాధాకరమని అభిప్రాయపడ్డారు. పోలీసులు సాక్షులను విచారిస్తూ, హత్యకు ఇతర కారణాలు ఉన్నాయా అని ఆర్గాతున్నారు. మరియాదాస్ వాంగ్మూలం ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు.
వాట్సాప్ నెంబర్ 94905 20108 కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు