ఎవరు అవునన్నా కాదన్నా చంద్రబాబు రాజకీయాల్లో అపర చాణిక్యుడే. లేకపోతే 14 ఏళ్లపాటు సీఎంగా ఎలా పనిచేస్తారు. ఇప్పుడు కూడా ఏడు పదులు దాటిన వయసులోను వైసీపీ అధినేత జగన్ కు చుక్కలు చూపిస్తున్నారు. వైనాట్ 175 అనే నినాదం నుంచి తప్పకుండా గెలుస్తాం అనే వరకు తీసుకురాగలిగారు. అంటే చంద్రబాబు అంత టఫ్ ఇస్తున్నారు అన్నమాట.


చంద్రబాబు ఏం చేసినా.. దానికి మీడియా కవరేజ్ మాత్రం తప్పకుండా ఉంటుంది.  కాదు.. కాదు ఉండేలా చేసుకుంటారు. అయితే ప్రజల వద్దకు పాలన అనే నినాదాన్ని 1999 నుంచి ఇస్తూ వస్తున్నా దానిని అమలు చేసింది మాత్రం సీఎం జగన్ మోహన్ రెడ్డే. వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి 50 కుటుంబాలకు ఓ వాలంటీర్ ను నియమించి.. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ప్రజలకు ప్రభుత్వంలో ఉండే పనులను వీళ్లే దగ్గరుండి చక్క బెట్టేవారు. దీంతో ప్రజల్లో వాలంటీర్లపై సానుభూతి.. దీనిని తీసుకువచ్చిన జగన్ పై నమ్మకం ఏర్పాడ్డాయి.


ఇక అవ్వాతాతల విషయానికొస్తే ఒకటో తారీఖు వస్తే చాలు అలారం మోగినట్లు ఇంటి ముందుకు వచ్చి పిలిచీ మరీ పింఛన్లు ఇచ్చేవారు. కానీ తనకు రాజకీయంగా నష్టం జరుగుతుంది అనే ఉద్దేశంతో వాలంటీర్లను చంద్రబాబు పక్కన పెట్టించారు. దీంతో ఇది రాజకీయంగా పెద్ద దుమారం రేగింది. వెంటనే అప్రమత్తమైన చంద్రబాబు వాలంటీర్ల ద్వారా జరిగే నష్ట నివారణ చర్యలను చేపట్టారు.


తాము అధికారంలోకి వస్తే ఈ వ్యవస్థను కొనసాగించడంతో పాటు వీరికి గౌరవ భృతి రూ.10 వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు. అయితే షరతులు వర్తిస్తాయి అన్న మాదిరిగా వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామన్నారు కానీ.. ప్రస్తుతం ఉన్న వాలంటీర్లను కొనసాగిస్తాం అని చెప్పలేదు. ఇప్పుడు ఇది అంతా ఎందుకు అంటే కొన్ని చోట్ల ఓ యాభై ఇళ్లకు ఓ టీడీపీ కార్యకర్తను నియమించి.. ఆ కుటుంబాలకు కూటమే అధికారంలోకి వస్తుంది. అప్పుడు మేమే వాలంటీర్లం అవుతాం అని చెప్పి ఓట్లు అడుగుతున్నారు. ఆ కుటుంబాల చేత ఓట్లు వేయించే బాధ్యత  ఒక్కో టీడీపీ కార్యకర్తకు అప్పగించినట్లు తెలుస్తుంది.  మరి చంద్రబాబు వ్యూహం ఫలిస్తుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: