హైదరాబాద్ లోని ఇంట్లో కూర్చుని మూడు రాజధానుల విషయంలో ప్రభుత్వంపై చంద్రబాబునాయుడు ఎంత గోల చేస్తున్నది అందరూ చూస్తున్నదే. అమరావతిని రాజధానిగా 5 కోట్లమంది జనాలు అంగీకరించారని, మానసికంగా జనాలతంతా కనెక్టయిన రాజధానిని వైజాగ్ కు  మార్చాలని అనుకోవటం జగన్మోహన్ రెడ్డి తుగ్లక్ వ్యవహారమే అంటూ పదే పదే ఆరోపణలు, విమర్శలు చేస్తున్నాడు. అసలు రాజధానిగా వైజాగ్ కావాలని ఎవరైనా జనాలు జగన్ను అడిగారా ? అంటూ చంద్రబాబు విచిత్రమైన లాజిక్ లేవదీశాడు. మరి అమరావతిని మాత్రం జనాలు ఎవరడిగారని ఎదురు ప్రశ్నిస్తే మాత్రం మళ్ళీ చంద్రబాబు నోరెత్తడు. సరే ఈ విషయాన్ని పక్కనపెట్టేస్తే జనాలు రాజధానిగా వైజాగ్ వద్దని అంటున్నారని చంద్రబాబు చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది. మరి ఇదే నిజమైతే చంద్రబాబు రాజధానికి వ్యతిరేకంగా వైజాగ్ లోను న్యాయ రాజధానికి వ్యతిరేకంగా కర్నూలులోను సభలు ఎందుకు పెట్టకూడదు ? అన్నదే ఇపుడు పెద్ద ప్రశ్న.





మొదటినుండి కూడా చంద్రబాబు వ్యవహారం ఎలాంగుంటుందంటే తాను ఏదనుకుంటే దాన్నే జనాలందరూ కోరుకుంటున్నారంటూ అందరినీ నమ్మించేందుకు తెగ ప్రయత్నిస్తాడు. చంద్రబాబు మనసులోని మాట తెలుసుకోవటం ఆలస్యం ఎల్లోమీడియా జనాల అభిప్రాయాలకే  చంద్రబాబు సానుకూలంగా స్పందిస్తున్నట్లు పెద్ద కలరింగ్ ఇస్తుంది. అయితే ఇది చాలా పాత వ్యూహమని మొదటినుండి చంద్రబాబు ఇలాంటి చీప్ ట్రిక్స్ తోనే రాజకీయాలు చేస్తున్నాడనే విషయం జనాలు తెలుసుకుని చాలా కాలమే అయిపోయింది. జనాలు తెలుసుకున్నారన్న విషయమే బహుశా చంద్రబాబుకు ఇంకా అర్ధంకాలేదు. నిజానికి అమరావతి రాజధానికి రాష్ట్రం జనాల్లో చాలామంది కనెక్టు కాలేదు. చివరకు చంద్రబాబు కాన్సెప్టును రాజధాని జిల్లాలే కాదు చివరకు రాజధాని నియొజకవర్గాలైన తాడికొండ, మంగళగిరి జనాలు కూడా తిప్పికొట్టారు.




 వాస్తవం ఇలాగుంటే చంద్రబాబు మాత్రం అమరావతి 5 కొట్లమందికి చెందిన రాజధానిగా ఒకటే ఊదరగొడుతున్నాడు. సరే చంద్రబాబు వాదనే నిజమని కాసేపు అనుకున్నా ఇదే విషయాన్ని వైజాగ్, కర్నూలు జిల్లాలకు వెళ్ళి అక్కడి జనాలతో చెప్పించాలి కదా ? తమ ప్రాంతం అభివృద్ధి జరుగుతుందంటే ఏ జిల్లా అయినా వ్యతిరేకిస్తుందా ? హేమిటో చంద్రబాబు బుద్ధి, ఆలోచనలు ఇంత చీపుగా మారిపోయింది. కాబట్టి తన ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అనుభవాన్ని ఉపయోగించి చంద్రబాబు అర్జంటుగా వైజాగ్, కర్నూలుకు వెళ్ళి బహిరంగసభలు పెట్టాలి. ఒకవేళ బహిరంగ సభలకు సాధ్యంకాకపోతే  జిల్లాల్లో పర్యటించి జనాలతో సమావేశాలు పెట్టి అమరావతినే రాజధానిగా కంటిన్యు చేయాలని తీర్మానాలు చేయిస్తే బాగుంటుంది. అంటే అమరావతికి అనుకూలంగా పై జిల్లాల్లో, ప్రాంతాల్లో చంద్రబాబు క్షేత్రస్ధాయిలో  తిరిగి  జనాలతో తీర్మానాలు చేయించాలి.




అమరావతికి అనుకూలమని, వైజాగ్ కు వ్యతిరేకంగా ఎక్కడో హైదరాబాద్ లో కూర్చుని చంద్రబాబు జూమ్ యాప్ లో  మీడియా సమావేశాలు, జాతినుద్దేశించి మాట్లాడటం కాదు. ఇప్పటికే జనాలతో ప్రత్యక్షంగా సంబంధాలు తెగిపోయి సుమారు ఐదు నెలలవుతోంది. అమరావతికి అనుకూలంగా రాష్ట్రంలోని జనాలందరూ రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపాలని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరగబడాలని ఎన్నిసార్లు పిలుపిచ్చినా ఎవరు పట్టించుకోలేదు. జనాలు పట్టించుకోకపోవటంలో వింతేమీ లేదు. చివరకు పార్టీ నేతలు, క్యాడర్ కూడా చాలా లైట్ గా తీసుకున్నారు. చంద్రబాబు ఫోన్ చేస్తుంటే ఉత్తరాంధ్ర జిల్లాల్లోని నేతల్లో చాలామంది ఫోన్లు స్విచ్చాఫ్ అని వస్తోందట. అంటే వైజాగ్ రాజధానిగా వద్దని వ్యతిరేకించటమంటే రాజకీయంగా తమ సమాధిని తామే నిర్మించుకోవటమని అందరికీ తెలుసు. అదే సమయంలో  రాజధానిగా వైజాగ్ వస్తోందంటే టిడిపి నేతల్లో చాలామంది హ్యాపీగానే ఉన్నారు.




అయితే తమలోని సంతోషాన్ని బహిరంగంగా బయటకు చెప్పుకోలేకపోతున్నారు. కానీ అంతర్గతంగా జరిగే సంభాషణల్లో మాత్రం పిచ్చ హ్యాపీగా ఫీలవుతున్నారట. ఈ కారణం వల్లే చంద్రబాబు పిలుపుకు స్పందించలేక చివరకు పార్టీ కార్యక్రమాలకే దూరంగా ఉంటున్నారు. అంటే ఇదే కార్యక్రమాలతో పార్టీకే దూరంగా ఉంటున్నారంటే రేపు ఒకవేళ చంద్రబాబు నేరుగా పర్యటనకు వస్తే ఏమి చేస్తారనేది ఆసక్తిగా మారింది. అయితే చంద్రబాబు అంత ధైర్యం చేస్తాడని అనుకునేందుకు లేదు. చంద్రబాబు రాజకీయమంతా దొడ్డిగుమ్మం నుండే జరుగుతుందన్న విషయం అందరికీ తెలిసిందే. నేరుగా ప్రత్యర్ధులను ఎదుర్కొనేంత సీన్ మొదటినుండి కూడా చంద్రబాబుకు లేదు. కాబట్టి ఇపుడు కూడా వైజాగ్, కర్నూలుకు వ్యతిరేకంగా జగన్ను దెబ్బకొట్టాలని అలవాటైన పద్దతిలోనే దొడ్డిదారి రాజకీయాలు చేస్తున్నాడు. చూద్దాం చివరకు ఏమవుతుందో ?





మరింత సమాచారం తెలుసుకోండి: