భైంసాలో జరిగిన దుర్మార్గంలోని రహస్యం ఏమిటి? ఎవరు ఈ పాపాలకు గత కొన్ని సంవత్సరాల పాటు కారణం అవుతున్నారు ?  అది గత ఏడేళ్ల పాలనలో ఉన్న ప్రభుత్వం చేతగాని తనమా? ఉమ్మడి రాష్ట్రంలో జరగని దుర్మార్గం ఇప్పుడు మన తెలంగాణవాసుల పాలనలో జరగటం శోచనీయం.


మనకు పాలించటం చేతకాదా? జనం అనుకుంటున్నట్లు  "రజ" కు "కారు" తోడై రజాకార్ల పాలనా అక్కడ నడుస్తుందా? అనుమానానికి కారణం అక్కడ పాలన "ఎంఐఎం +  టీఆరెస్ సంయుక్తం"గా నడుపుతున్నారు కదా! "రజ + కారు" పాలన కొనసాగితే  భైంసా బ్రతుకు ఇంతే!అంటున్నారు ఇక్కడి ప్రజలు. ఇక ఆ గ్రామం బాగుపడదా?


అల్లర్లు జరిగిన తరవాత నేడు మూడవ రోజు - అయినా భైంసాలో వ్యాపార సంస్థలు ఇంకా తెరుచు కోలేదు. పట్టణం లోకి రాకపోకలపై పోలీసుల నిఘా మరియు ఆంక్షలు కొనసాగుతున్నాయని తెలుస్తుంది. కానీ భైంసా ప్రశాంతం అంటున్నారు పోలీసులు. అల్లర్ల పై నాలుగు కేసులు నమోదయ్యాయి. పోలీసుల అదుపులో 28 మంది అనుమానితులున్నారు. అంతర్జాల సేవలు అధికారులు నిలిపివేశారు. ముస్లిం జనాభా మెజారిటీ పక్షంగా మారితే,  ప్రపంచం అంతటా అనుకుంటున్నట్టు అక్కడ ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయనేది మరోసారి ఋజువైందా!
ఎస్పీ విష్ణు వారియర్ భద్రతను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.


ప్రజలు వదంతులను నమ్మవద్దని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ ప్రకటించారు. అయినా అసలు అక్కడ ఏం జరుగుతోంది అనేది ప్రధాన ప్రశ్న. దీనికి సరైన సమాధానం ఇవ్వలేకపొతే - మనం ప్రభుత్వం లేనేలేదని భావించ వలసి ఉంటుంది.


తెలంగాణ పోలీసులు అత్యంత సమర్థులు అందులో ఇక్కడి ప్రజలకు అనుమానం లేదు. కానీ వారిని తమ రాజకీయ స్వార్ధ ప్రయోజనాల కోసం సమర్ధవంతంగా పనిచేయనివ్వని పాలకుల దుర్మార్గమనే ఈ దురాగతాలకు కారణమని ప్రజలంటున్నారు. "సయ్యద్ ఖాసిమ్ రజ్వి" నేతృత్వం లోని రజాకార్ల, హింసాత్మక, "స్వయం సేవకుల" సంస్థ, రజాకార్లు. వారి రాజకీయ వారసత్వమే కాదు ఆర్ధిక సంపద వరకు మొత్తం "ఎంఐఎం" పార్టీకే బదిలీ అయింది కదా! నిజాం కోసం ప్రవేట్ సైన్యం నిర్మించి నాడు నైజాంలో దుశ్చర్యలు నిరాటంకంగా కొనసాగించినచరిత్ర నేటి "ఎంఐఎం" ది. దాని మిత్రుడే టీఆరెస్.


రజ్వి షార్ట్ కట్ "రజా" - "కారు" టీఆరెస్ గుర్తు - అందుకే భైంసాలో నేడు జరిగేది నాటి 'రజాకార్' లను గుర్తు చేస్తుంది. ఇది యాదృచ్చికమే అయినా ఇది నిజమే కదా!


టీఆరెస్ ప్రభుత్వం ఇప్పటికైనా భైంసా సంఘటనను ఓటు బ్యాంకుతో అనుసంధానం చేయకుండా సరిగా విచారణ జరిపి నిజాం నిగ్గు తేల్చకుంటే - యదార్ధం వెలువరించకుంటే ప్రజలు అక్కడ రాజాకార్ల పాలన మొదలైందనే అంటారు.      


ఎం ఐ ఎం నేత,  భైంసా మున్సిఫల్ ఛైర్మెన్ మహమ్మద్ జబీర్ అహ్మద్,  మరియు ఆయన కుటుంబ సభ్యులు  భైంసాలో జరిగిన పాపానికి కారణం అంటున్నారు ఎంపీ ధర్మపురి అరవింద్. దానిపై విచారణ జరిపితే సమర్థులైన తెలంగాణ పోలీసులు కొన్నిగంటల్లో లెక్క తేల్చేయ గలరు. ఆ పని చేయకపోవడానికి కారణం ఎవరు? ఎవరు? ఇది ప్రజల్లో ప్రతిధ్వనించే ప్రశ్న.


ఈ సమస్యపై దృష్టి సారించాల్సింది ఎవరిప్పుడు? రాష్ట్ర  ప్రభుత్వం పాలించలేకపోతే నియంత్రించలేకపోతే అంతర్గత భద్రత దృష్ట్యా కేంద్రం బాధ్యత వహించాలి. బాధ్యత వహించక పోవటం మహా నేరం అంటున్నారు తెలంగాణ వాసులు. భైంసా లో ఇప్పుడు నడిచేది "రజా - కార్" ల - పాలన మాత్రమే అయితే పర్వాలేదు. అలా కాకుండా నాడు పాకిస్తాన్ కు పారిపోయిన ఖాసీం రజ్వి వారసులైన రజాకార్ల పాలనైతే మాత్రమైతే ప్రమాదమే. అంటున్నారు వివిధ వర్గాల ప్రజలు - ప్రజా సంఘాలు

 

మరింత సమాచారం తెలుసుకోండి: