రష్యా ఉక్రెయిన్‌పై విరుచుకుపడుతున్న సమయంలో వెన్నుచూపని ధీరుడిగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ ప్రపంచ దేశాల నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు. యుద్ధం మొదలైన తొలిరోజుల్లో మేం నిస్సహాయులుగా మిగిలిపోయాని కాస్త బేలగా మాట్లాడిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ ఆ తర్వాత ధైర్యం తెచ్చుకుని కదన రంగంలో ముందుకే వెళ్లాలని నిర్ణయించారు. యుద్ధం ప్రారంభమైన రెండు రోజులకే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ బంకర్‌కు తరలిపోయారని... ఆయన దేశం వీడి వెళ్లిపోవచ్చని ప్రచారం జరిగింది. కానీ.. ఎవరు సాయం వచ్చినా రాకపోయినా.. ప్రాణం పోయే వరకూ ఉక్రెయిన్ వీడేది లేదని ఆయన తేల్చి చెప్పిన తీరు ప్రపంచం ప్రశంసలు అందుకుంటోంది.


తాజాగా ఆయన ఐరోపా యూనియన్‌ సభ్య దేశాల సమావేశంలో మాట్లాడిన తీరు కూడా ప్రశంసలు అందుకుంటోంది. మేం మీతో సమానం.. మీతో సమానంగా ఉండేందుకు ఉక్రెయిన్‌ పోరాడుతోందని ఈ యూ సమావేశంలో ఉక్రెయిన్ దేశాధ్యక్షుడు జెలెన్‌స్కీ అన్నారు. యూరోపియన్‌ పార్లమెంటును ఉద్దేశించి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ ఆన్‌లైన్‌ విధానంలో ప్రసంగించారు. ‘మేమేంటో ఈ రోజు ప్రతి ఒక్కరికీ చూపిస్తున్నామని తాను నమ్ముతున్నానని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ అన్నారు.


మేము మీతో అంటే యూరోపియన్ యూనియన్‌తో సమానమేనని ఇప్పటికే నిరూపించామని... మా స్వేచ్ఛ, మాతృభూమి కోసమే కాకుండా ఐరోపా యూనియన్‌లో సమాన సభ్యదేశంగా ఉండేందుకూ పోరాడుతున్నామని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ భావోద్వేగంతో అన్నారు.  మమ్మల్ని ఈయూలో చేర్చుకోండని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ తన ప్రసంగంలో విన్నవించారు.


యూరోపియన్ యూనియన్ పార్లమెంట్‌లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ చేసిన ప్రసంగానికి జేజేలు లభించాయి. యూరోపియన్‌ పార్లమెంటులో ఆయనకు చాలా అరుదైన గౌరవం దక్కింది. మేము ఉక్రెయినియన్లం.. శక్తిమంతులం..  మమ్మల్ని ఎవరూ విడదీయలేరు.. అంటూ జెలెన్‌ స్కీ తన ప్రసంగం ముగించగానే సభ్యులంతా ఒక్కసారిగా లేచి నిల్చుని చప్పట్లు కొట్టారు.. అని ఆయన వ్యాఖ్యానించగా.. సభ్యులంతా లేచి ఆయన్ని అభినందించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: