నోట్ల రద్దు.. భారత దేశంలో సంచలనం సృష్టించిన ప్రధాని మోదీ నిర్ణయం. ఉన్నపళంగా పెద్ద నోట్లన్నీ రద్దు చేస్తూ ప్రధాని తీసుకున్న నిర్ణయంతో దేశమంతా గగ్గోలెత్తింది. ఉన్న పెద్ద నోట్లు మార్చుకునేందుకు జనం నానా తంటాలు పడ్డారు. అయితే అదే సమయంలో చాలా కుంభకోణాలు జరిగినట్టు కూడా వార్తలు వచ్చాయి. పెద్ద నోట్లు భారీగా ఉన్న బడాబాబులు వాటిని మార్పించుకునేందుకు నానా తంటాలు పడ్డారు.


అయితే.. ఈ నోట్ల రద్దు సమయంలో ఆంధ్రజ్యోతి పత్రిక ఎండీ రాధాకృష్ణ వందల కోట్ల స్కామ్ చేసారట.. హైదరాబాద్‌లోని బంగారం షాపుల వాళ్లను బెదిరించి కోట్ల రూపాయల స్కామ్ చేశారట.. ఈ విషయాన్ని ఇప్పుడు ఏపీ కాపునేత ముద్రగడ పద్మనాభం ఆరోపిస్తున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఓ నాయకుడితో ఆర్కే మాట్లాడుతూ.. ముద్రగడ పద్మనాభంపై ఏవో ఆరోపణలు చేశారట. దీంతో ఆయనకు కోపం వచ్చింది. వెంటనే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు ఓ లేఖ రాశారు.


లేఖ ఇప్పుడు మీడియా సర్కిల్‌లో హాట్ టాపిక్ అవుతోంది. ఆ లేఖలో ముద్రగడ పద్మనాభం ఆర్కేపై ఎన్నో ఆరోపణలు చేశారు. అయితే అవన్నీ ఎప్పుడూ వినేవే.. పెద్ద కొత్తగా ఉన్నవేవీ లేవు. కానీ.. ఈ నోట్ల రద్దు ఆరోపణ మాత్రం కొత్తగా ఉంది. నోట్ల రద్దు సమయంలో నేలమాళిగలో దాచుకున్న కోట్ల డబ్బును బంగారం షాపుల వాళ్లను బెదిరించి, చలామణీలోకి తీసుకువచ్చారనేది ముద్రగడ విమర్శ..


మరి ఈ విమర్శలో ఎంత వాస్తవం ఉందనేది చెప్పలేం.. పెద్దనోట్ల రద్దు సమయంలో మాత్రం చాలా కుంభకోణాలు జరిగినట్టు పత్రికల్లో వార్తలు వచ్చాయి. కానీ ఇలా ఓ పత్రికాధిపతిపై మాత్రం ఇలాంటి ఆరోపణలు ఊహించేవి కావు. మరి ఇందులో వాస్తవం ఎంతో వారికే తెలియాలి. అయితే.. ఈ లేఖపై సదరు ఆంధ్రజ్యోతి ఆర్కే స్పందిస్తే ఏమైనా విషయాలు వెలుగులోకి రావచ్చు. కానీ ఆయన ఇలాంటి ఆరోపణలను పట్టించుకుంటారని చెప్పలేం. ఆధారాలు లేని ఇలాంటి ఆరోపణలు ఎంత మందిపైనైనా ఎన్నైనా చేయొచ్చు. కానీ అవి వాదనకు నిలబడవు కదా.


మరింత సమాచారం తెలుసుకోండి: