ప్రధాని నరేంద్ర మోడీ జమ్మూకాశ్మీర్‌లో పర్యటిస్తున్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారి జమ్మూకాశ్మీర్‌ లో ప్రధాని పర్యటిస్తున్నారు. అక్కడ ప్రధాని నరేంద్ర మోడీ పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. బనిహాల్-కాజీగుండ్ సొరంగ మార్గాన్ని ప్రధాని మోడీ ప్రారంభిస్తారు. అలాగే రూ.20వేల కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపనలు చేస్తారు. జాతీయ పంచాయతీరాజ్‌ దినోత్సవం సందర్భంగా గ్రామసభలను ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగిస్తారు.


జమ్మూకాశ్మీర్‌ సాంబా జిల్లా పల్లీ గ్రామంలో పర్యటించనున్న ప్రధాని నరేంద్ర మోడీ.. అక్కడ గ్రామసభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ప్రధాని పర్యటనకు ఈ పల్లీ గ్రామాన్ని ఎంచుకోవడం వెనుక కూడా ఓ కథ ఉంది. జమ్మూకాశ్మీర్‌లోని ఈ పల్లీ గ్రామంలో ప్రధాని నరేంద్ర మోడీసౌర విద్యుత్ ప్లాంట్‌ను ప్రారంభిస్తారు. దేశంలో ఎక్కువగా సౌర విద్యుత్‌ను వినియోగిస్తున్న పల్లెగా ఈ పల్లీ రికార్డు సృష్టించింది. అందుకే ఈ గ్రామంలో సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేశారు.

 
అయితే.. ఇటీవల జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలు మళ్లీ జోరందుకుంటున్నాయి. అలాగే ఇటీవల భద్రతాదళాలు నలుగురు ముష్కరులను ఎన్‌కౌంటర్‌ చేశాయి. ఈ ఘటనల దృష్ట్యా ప్రధాని పర్యటనకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. జమ్మూకాశ్మీర్‌ పర్యటనను ప్రధాని మోదీ ఒక్క రోజుకే పరిమితం చేశారు. సాయంత్రానికి మళ్లీ మోదీ తిరిగి వచ్చేస్తారు. జమ్మూ కాశ్మీర్‌లో 360 ఆర్టికల్ రద్దు తర్వాత అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. విపక్షాలన్నీ ఏకమవుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన ఆ రాష్ట్రంలో బీజేపీ అభివృద్ధికి దోహదపడే అవకాశం ఉంది.


ఇక జమ్మూకాశ్మీర్‌ నుంచి నేరుగా ప్రధాని ముంబయి వస్తారు. ఇవాళ సాయంత్రం ముంబయిలో ప్రధాని మోదీ.. మాస్టర్‌ దీనానాథ్‌ మంగేష్కర్‌ అవార్డు అందుకుంటారు. లతా మంగేష్కర్ జ్ఞాపకార్థం ఈ  మాస్టర్ దీనానాథ్‌ మంగేష్కర్ అవార్డు ఏర్పాటు చేశారు.  ఈ అవార్డు తొలి గ్రహీత ప్రధాని నరేంద్ర మోడీ కావడం విశేషం.


మరింత సమాచారం తెలుసుకోండి: