సోనియా గాంధీ విదేశాల్లో పుట్టిన వనిత అని అందరికీ తెలిసిందే. ఇటలీలో పుట్టిన ఆమె.. రాజీవ్ గాంధీని ప్రేమ వివాహం చేసుకుని ఇండియా వచ్చి  సెటిల్ అయ్యాురు. ఆ తర్వాత ఆమె ఇండియన్ పౌరసత్వం తీసుకున్నారు. అయినా.. అనేక సందర్భాల్లో ఆమె పౌరసత్వం వివాదాల్లోకి వచ్చింది. ఆ వివాదమే ఆమెను ప్రధానికి కాకుండా చేసింది కూడా. అయితే ఇప్పుడు సోనియా గాంధీపై కేఏ పాల్‌ సంచలన ఆరోపణలు చేస్తున్నారు.


సోనియా గాంధీ భారతదేశంలో అవినీతిని పెంపొందింపజేసి, దేశాన్ని అస్థిర పరిచేందుకు కుట్ర పన్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కే ఏ పాల్‌ ఆరోపించారు. ఈ మేరకు ఓ యూట్యూబ్ ఛానల్‌ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆరోపణలు చేశారు. అమెరికా, ఇటలీ లాంటి దేశాలు పన్నిన కుట్రలో సోనియా గాంధీ ద్వారా దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ చిక్కుకున్నారని కే ఏ పాల్‌ సంచలన ఆరోపణలు చేశారు. ఈనెల 2న పాపులర్ టీవీ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్ఫ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు.


అంతే కాదు..కే ఏ పాల్‌.. సోనియాను అవమాన పరిచే రీతిలో ఓల్డ్ లేడీ, విడో, చీటర్, లయర్, సైతాన్ అని పదే పదే కామెంట్ చేశారు. దీంతో ఈ ఇంటర్వ్యూ చూసిన తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు మండిపడుతున్నారు. సోనియాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేఏ పాల్ పై చర్యలు తీసుకోవాలంటూ పోలీసు కమిషనర్ కు టీపీసీసీ కార్యదర్శి బండి సుధాకర్‌ గౌడ్‌ ఫిర్యాదు చేశారు.  కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కే.ఏ.పాల్ పై కేసు నమోదు చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.


టీపీసీసీ కార్యదర్శి బండి సుధాకర్ గౌడ్  హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ ను కలిసి పాల్‌ పై  ఫిర్యాదు చేశారు.  కేబుల్ టీవీ నెట్ వర్క్స్ రెగ్యులరైజేషన్ అమెండ్ మెంట్ యాక్ట్ 2000(36/2000) ప్రకారంగా పోలీసు కమిషనర్ కే.ఏ.పాల్ పై కేసు నమోదు చేయాలని కోరారు.  శాంతిని బోధించే బైబిల్ కు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న కేఏ పాల్ 48 గంటల్లోగా సోనియాపై చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని బేషరతుగా క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ నేత సుధాకర్ గౌడ్ డిమాండ్ చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: