హైదరాబాద్ ను అనూహ్యంగా వర్షాలు వెంటాడుతున్నాయి. నిన్న ఎండ దంచికొట్టిన కొద్దిసేపటికే వాతావరణం అనూహ్యంగా మారి.. కుండపోతగా వాన కురిసింది. కుమ్మరించినట్టుగా వర్షం దంచి కొట్టింది. ఇటీవల కేసీఆర్‌ క్లౌడ్ బరస్ట్ జరుగుతోందని చేసిన వ్యాఖ్యల సంగతి పక్కకు పెడితే.. ఈ కుండపోతకు కారణాలను వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్‌లో ఎండలకు పగటి ఉష్ణోగ్రత 3 డిగ్రీల దాకా అదనంగా పెరగిందని.. వేడికి ఏర్పడిన పీడనంతో మేఘాలు కిందకు వచ్చి కుండపోత వర్షం కురిసిందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.


అంతే కాదు.. ఇటీవలి కాలంలో తరచూ ఇలా జరుగుతోందని చెప్పారు. ఇవాళ, రేపు కూడా అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో అప్పటికప్పుడు కుండపోత వర్షం కురవొచ్చని కూడా వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. హైదరాబాద్‌లో నిన్న వానదేవుడు మరోసారి తన ప్రతాపం చూపించాడు.


దాదాపు మూడు గంటలపాటు ఆగకుండా కురిసిన భారీ వర్షానికి నగరం వణికిపోయింది. లోతట్టు ప్రాంతాలు జలమయమై రోడ్లపై భారీగా వరద ప్రవహించింది. ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడి జనం తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. గంటల వ్యవధిలోనే ఏకంగా 5 నుంచి 10 సెంటీమీటర్ల భారీ వర్షం పడింది. కొద్దిగంటల్లోనే 5 నుంచి 10 సెంటీమీటర్ల భారీ వర్షం పడటం ఇటీవల కాలంలో తరచూ జరుగుతోంది. హైదరాబాద్ నగర శివారులోని మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా దమ్మాయిగూడలో అధికంగా 10.1 సెంటీమీటర్ల వర్షం కురిసినట్టు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.


అలాగే.. నేరేడ్‌మెట్‌లో 9.5, ఈస్ట్‌ ఆనంద్‌బాగ్‌లో 7.3, సింగపూర్‌ టౌన్‌షిప్‌లో 6.6, ASరావునగర్‌లో 6, రంగారెడ్డి జిల్లాదండుమైలారంలో 9.7, హయత్‌నగర్‌లో 6.2, పెద్ద అంబర్‌పేటలో 5.9 సెంటీమీటర్ల వాన పడినట్టు వాతావరణ శాఖ అధికారులు అధికారులు వివరించారు. చివరకు ఈ వర్షానికి  ప్రైవేట్‌ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఎల్బీనగర్ వెళ్లిన హోంమంత్రి మహమూద్‌ అలీ కాన్వాయ్‌ వరద కారణంగా ఆగింది. పోలీసులు అతి కష్టంమీద కాన్వాయ్‌ని బయటకు పంపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: