రాజకీయాల్లో ఎప్పుడూ విమర్శలు, ప్రతి విమర్శలు, వ్యూహాలు, ప్రతివ్యూహాలు, సవాళ్లు, ప్రతి సవాళ్లేనా.. కాస్త అప్పుడప్పుడు ఆట విడుపు కూడా ఉండాలిగా.. అలాంటిదే ఇప్పుడు ఈ తాజా ఉదంతం.. ఏమైందంటే.. చేనేత దినోత్సవం సందర్భగా తెలంగాణ మంత్రి కేటీఆర్‌ పవన్ కల్యాణ్‌కు ఓ ఛాలెంజ్ విసిరారు. చేనేత వస్త్రాలు ధరించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేయాలన్నది ఆ ఛాలంజ్‌ ఉద్దేశ్యం..  కేటీఆర్‌ ఇదే ఛాలెంజ్‌ను ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్‌ మహీంద్రా, క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందుల్కర్‌తో పాటు పవన్‌కు విసిరారు.


 కేటీఆర్ ఛాలెంజ్‌ను స్వీకరించిన పవన్ కల్యాణ్‌.. అందుకు తగ్గట్టుగానే స్పందించారు. కేటీఆర్ విసిరిన ఛాలెంజ్‌ను జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ హుందాగా తీసుకున్నారు.  పవన్‌ స్పందిస్తూ కేటీఆర్‌ ఛాలెంజ్‌ను స్వీకరిస్తున్నట్లు ప్రకటించారు. రామ్‌ భాయ్‌.. మీ ఛాలెంజ్‌ను స్వీకరించా అంటూ సోషల్ మీడియాలో స్పందించారు. తాను చేనేత వస్త్రాలు ధరించిన ఫొటోలను పవన్ కల్యాణ్‌ సోషల్ మీడియాలో షేర్ చేశారు.


అయితే.. కథ అక్కడితో ఆగలేదు.. తన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన పవన్ కల్యాణ్..  అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబు, తెలంగాణకు చెందిన బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌, ఏపీ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డికి వంటి మరికొందరికి ఈ చేనేత సవాల్‌ విసిరారు. మీరు కూడా చేనేత వస్త్రాలు ధరించిన ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్టు చేయాలని పవన్‌ కల్యాణ్‌ వారికి ఛాలెంజ్ విసిరారు.


ఇక ఇప్పుడు ఈ ఛాలెంజ్‌కు చంద్రబాబు కూడా స్పందిస్తే భలే బావుంటుంది. అలాగే పవన్ కల్యాణ్ ఇదే సవాల్ ఏపీ సీఎం జగన్‌కు కూడా విసిరి ఉంటే కథ ఇంకాస్త రంజుగా ఉండేది.. ఏదేమైనా ఎప్పుడూ రాజకీయ యుద్దాలే కాకుండా ఇలా ఆటవిడుపుగా కాస్త ఇతర అంశాలపైనా స్పందిస్తూ ఉండే.. రాజకీయాలు మరింత హుందా.. ఆహ్లాదంగా మారుతుంటాయి కదా.

మరింత సమాచారం తెలుసుకోండి: