ఏపీ రాష్ట్రంలోని పెట్టుబడుల పై పెద్ద ఎత్తున దుష్ప్రచారం సాగుతోందని పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అంటున్నారు. 16 లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు చేసుకున్నట్టు ఇటీవల కూడా చెప్పిన చంద్రబాబు.. కానీ వచ్చింది కేవలం 34 వేల కోట్లు మాత్రమేనని పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. తాజాగా ఏపీలో కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కు జిందాల్ స్టీల్ ముందుకు వచ్చిందని.. 2 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం తో 8,800 కోట్ల పెట్టుబడి వస్తుందని పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ వివరించారు.


భవిష్యత్ లో 4.5 మిలియన్ టన్నులు ఉత్పత్తి సామర్థ్యం పెంచుకునేలా ప్రణాళిక చేశారని.. సోలార్, విండ్  పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులు వస్తున్నాయని.. 30 చోట్ల ఈ స్టోరేజ్ ప్రాజెక్టుల కు అవకాశం ఉందని గుడివాడ అమర్నాథ్ తెలిపారు. వీటిని సన్నిహితులకు కట్టబెట్టారని ఆరోపణలు సరికావన్న గుడివాడ అమర్నాథ్.. 33 వేల ప్రాజెక్టులకు అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం 13 వేల మెగావాట్ల ప్రాజెక్టు కు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు అనుమతినిచ్చిందని.. ఇంకా 10 వేల మెగావాట్ల పంప్డ్ ప్రాజెక్టులు పెట్టుకునేందుకు అవకాశం ఉందని గుడివాడ అమర్నాథ్ తెలిపారు.


అమర్ రాజా వెళ్లిపోయిందని ఆరోపిస్తున్న వారు ఎవరిని సంప్రదించి వెళ్ళిపోయారో చెప్పగలరా అని గుడివాడ అమర్నాథ్ ప్రశ్నించారు. పొరుగు రాష్ట్రంలో ఉండే వ్యక్తులు ఇక్కడ దుష్ప్రచారం చేస్తున్నారని.. అమర్ రాజ సంస్థ కాలుష్యం పై నోటీసులు ఇచ్చామని....ఈ వ్యవహారం కోర్టుల్లో ఉందని పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. ప్రజల ప్రాణాలు ఫణం గా పెట్టీ పరిశ్రమలు కు అనుమతి మా ప్రభుత్వం ఇవ్వదని పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు. జగన్ సన్నిహితులకే అనేక ప్రాజెక్టులు కట్టబెట్టారని ఇటీవల ఓ ప్రముఖ పత్రికలో కథనాలు వచ్చాయి. వాటికి కౌంటర్‌గా మంత్రి ఈ వివరాలు వెల్లడించారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: