
ఇదే అంశంపై భాషా పండితులు.. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని, సంబంధిత అధికారులను కలిసి వినతిపత్రం సమర్పించినా ఇంత వరకు పట్టించుకువడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులపై ఉపాధ్యాయ సంఘ నాయకులు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేనతో భాషా పండితులు సమావేశం నిర్వహించారు. బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని భాషా పండితులు విజ్ఞప్తి చేశారు. 1.13 జిల్లాల స్పౌజ్ బదిలీలను షెడ్యూల్ విడదలకు ముందే పూర్తి చేయాలని... జిల్లాలోని అన్ని ఖాళీలను బదిలీలకు భర్తీ చేయాలని భాషా పండితులు కోరుతున్నారు.
బదిలీ అనంతరం అందరినీ కొత్త పాఠశాలలో రిపోర్ట్ చేసి తిరిగి డెప్యుటేషన్ పై ప్రస్తుత పాఠశాలలో రిలీవర్ వచ్చేవరకు కొనసాగాలని ఉత్తర్వులు ఇవ్వాలని భాషా పండితులు కోరారు. 2018 బదిలీల్లో అధికారుల పొరపాటు కారణంగా బైపోస్ట్, లీన్ పోస్ట్ లో కొనసాగుతున్న ఉపాధ్యాయులను బదిలీలకు ముందుగానే ఒరిజినల్ పోస్టుల్లో సర్దుబాటు చేయాలని భాషా పండితులు అన్నారు. బదిలీలు, పదోన్నతుల సీనియారిటీ లిస్టులు లోపాలు లేకుండా తయారు చేయించాలని... అప్పీల్స్ కు తగిన సమయం ఇవ్వాలని భాషా పండితులు కోరారు. అప్పీల్స్ అన్నింటినీ పరిష్కారం చేసి ఫైనల్ లిస్ట్ ప్రకటించాలని భాషా పండితులు సంఘం నాయకులు కోరారు. మరి వీరి గోడును తెలంగాణ సర్కారు పట్టించుకుంటుందా?