
ఆ దెబ్బ వైయస్సార్సీపీకి ప్రధానంగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి రూపంలో తగలబోతుంది అని తెలుస్తుంది. అయితే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాత్రమే కాకుండా ఆనం నారాయణరెడ్డిని కూడా తమ వైపుకు తిప్పుకోబోతుందట తెలుగుదేశం పార్టీ. అలాగే తాజాగా మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిని కూడా తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. వీరు మాత్రమే కాకుండా అలాగే కడపలో వీర శివారెడ్డి, ఇంకా డి.ఎల్ రవీంద్ర రెడ్డిని కూడా బయటకు లాగేస్తున్నట్టుగా తెలుస్తుంది.
కడపలో గతంలో 52 కి 49 సీట్లు గెలిచిన వైఎస్ఆర్సిపికి అక్కడే చెక్కుపెట్టేందుకు నిశ్శబ్దంగా చంద్రబాబు చేస్తున్న ఎత్తు ఒకటి అయితే, రెండవ విషయం ఏంటంటే పార్టీలోంచి బయటకు వచ్చే ప్రతి నాయకుడు ఆ పార్టీపై ఏదో ఒక తప్పు చూపించి వస్తారన్న విషయం కనిపిస్తుంది. ఫోన్ టాపింగ్ అని, తమకు అన్యాయం జరిగిందని అక్రమం జరిగిందని నెమ్మదిగా బయటికి వచ్చేస్తున్న పరిస్థితి అయితే వైయస్సార్సీపీలో కనిపిస్తుంది.
2014లో టిడిపి గెలిచిన టైంలో వైఎస్ఆర్సిపి నుండి 23 మంది ఎమ్మెల్యేలను నిశ్శబ్దంగా బయటికి లాగి ఎలాంటి దెబ్బ అయితే కొట్టారో అలాంటి సీనే ఇప్పుడు రిపీట్ అవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది. తిరిగి అదే దెబ్బను వైఎస్ఆర్సిపి పై కొట్టబోతుంది తెలుగుదేశం పార్టీ. మరి తమ వెనుక, ముందు ఇంత జరుగుతున్నదని, జరగబోతుందని వైయస్సార్సీపీకి తెలియకుండా అయితే ఉండదు. ఇదంతా చూస్తున్న వైఎస్ఆర్సిపి మరి దీనిపై ఎటువంటి చర్యలు తీసుకుంటుందో, ఏమి ఎత్తు వెయ్యబోతుందో..?