ఆఫ్గానిస్తాన్‌తో పాటు, ఇజ్రాయిల్, ఇరాన్ లో ఉన్న పోర్టుల దాకా అదానీ కంపెనీలు గతంలో చేజిక్కించుకున్నాయి. దీంతో ఎలాగైనా ఇండియా నుంచి ఇంతటి వ్యాపారాన్ని కొనసాగిస్తున్న అదానీని దెబ్బతీయాలని అమెరికా, యూరప్ దేశాలు కక్ష గట్టాయని విమర్శలు వస్తున్నాయి. దీంతో హిండెన్ బర్గ్ నివేదిక అంటూ అదానీ గ్రూపు పై పెట్టుబడులు అంతా వట్టి వేనంటూ ప్రచారాన్ని చేశాయి. దీని వల్ల అదానీ గ్రూపులకు సంబంధించిన షేర్లు కుప్పకూలాయి. ప్రపంచ కుబేరుల్లో అగ్రస్థానంలో ఉన్న అదానీ 26 వ స్థానానికి పడిపోయారు. భారత్ లో కూడా చాలా మందికి అదానీ అంటే పడదు. బ్రిటిష్ వారికి గతంలో కూడా ఇలానే వ్యవహరించి బానిస బతుకులకు కారణమయ్యారు కొందరని విమర్శలు ఉన్నాయి.
 

ప్రస్తుతం వారికి వత్తాసు పలుకుతూ అదానీ షేర్లు పడిపోతే సంతోషిస్తున్న వారు ఇండియాలో ఎంతో మంది ఉన్నారు. ఇప్పటివరకు ఇజ్రాయిల్, ఇరాన్ లలో అమెరికా, యూరప్ దేశాలదే ఆధిపత్యం. కానీ ఇప్పుడు మార్పు వచ్చింది. భారతీయులు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటున్నారు. దీంతో కడుపు మండిన అమెరికా, యూరప్ దేశాల చర్యలు మన వ్యాపార దిగ్గజాలను సైతం తీవ్రంగా ముంచేస్తున్నాయి. అదానీ పని అయిపోయింది. ఇంకా అంబానీ పని పట్టేందుకు సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోందంటున్నారు.


హైడ్రోజన్ తో నడిచే ట్రక్ ను రిలయన్స్ ఇండస్ట్రీస్ తయారు చేసింది. దీని వల్ల గల్ఫ్ దేశాలకు పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పవచ్చు. ఇలా హైడ్రోజన్ తో నడిచే వాహనాలు తయారైతే మాత్రం అది గొప్ప సంచలనంగా మారుతుంది పెట్రోల్, డీజిల్ అవసరమే ఉండదు. గల్ప్ దేశాలకు ఆర్థిక వనరైన ఆయిల్ అమ్మకం లేకపోతే వారి బతుకులు దుర్బరమవుతాయి. అందుకే నెక్ట్స్ టార్గెట్ అంబానీయేనని అందరూ అనుకుంటున్నారు. అంబానీ రిలయన్స్ పై ఎలాంటి నివేదికలు బయటపెడతారో ఆయన కంపెనీలను ఎలా నష్టం చేయాడానికి ప్లాన్ వేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: