శ్రీలంకలో అధికారుల అవినీతి కారణంగా పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయింది. యూరప్ లో కూడా అవినీతే ఆర్థిక సంక్షోభానికి కారణమవుతోంది. ఖతర్ మీడియేటర్ కంట్రీగా ఉంటూ చాలా దేశాల్లో అవినీతి నాయకులకు డబ్బులు ఇస్తోంది. ఆప్గానిస్తాన్ లో తాలిబాన్ల దాడికి ముందు అధ్యక్షుడు ఘనీ అవినీతి చేసినట్లు తెలుస్తోంది. తాలిబాన్లతో యుద్ధం సమయంలో ఆప్గాన్ వద్ద ఉన్న సైన్యం 4.50 లక్షల మంది. తాలిబాన్లు  30,40 వేల మంది కూడా లేరు. కానీ వీరిపై ఆఫ్గాన్ సైన్యం ఓడిపోయి అధ్యక్షుడు ఘనీ తట్టా బుట్టా సర్దుకొని విమానమెక్కి డబ్బు సంచులతో వెళ్లిపోయారన్నది అందరికీ తెలిసిందే.


అయితే అసలు విషయం ఇప్పుడు బయట పడుతోంది. రష్యాన్లు బయటపెట్టిన విషయం ఏంటంటే హెలిక్యాప్టర్ ద్వారా డబ్బులు పట్టుకుపోయాడని తెలిపింది. ప్రస్తుతం ఇటలీకి సంబంధించిన టీజీ నెట్ వర్క్ చేసిన రీసెర్చ్ లో సరికొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఖతర్ దేశం నుంచి ఆఫ్గాన్ అధ్యక్షుడు ఘనీ 110 బిలియన్ డాలర్ల లంచం తీసుకున్నట్లు తెలిపింది. ఆ డబ్బులను బ్యాంకులో మార్చుకుని  దేశం విడిచి పారిపోయాడని పేర్కొంది. అఫ్గాన్ మార్షల్ సైనికాధికారి అబ్దుల్ రషీద్ దోస్తున్ కూడా 51 మిలియన్ డాలర్లను మింగేశారు.


అథన్ అహ్మద్ నూర్ 61 మిలియన్ డాలర్ల అవినీతి చేశారు. ఈయన బల్క్ ప్రావిన్స్ ప్రాంతంలో గవర్నర్ గా పని చేశారు. వీరందరికీ ఖతర్ డబ్బులు ఇచ్చిందని తెలుస్తోంది. ఆప్గానిస్తాన్ లో పాలకులే డబ్బులు తీసుకుని దర్జాగా దేశం విడిచి పారిపోయారని తన నివేదికలో టీజీ నెట్ వర్క్ పేర్కొంది. అంటే పక్కా ప్రణాళికతో తాలిబాన్లు దేశాన్ని ఆక్రమించే ముందు ఎవరికి వారు డబ్బు కట్టలతో దేశాన్ని విడిచి పారిపోయేందుకు సిద్ధమయ్యారు. దీన్ని అర్థం చేసుకోలేని ప్రజలు సైన్యం ఎందుకు ఓడిపోతోందో తెలియక అమాయకంగా చూస్తుండి పోయారు. తాలిబాన్ల అరాచకాలను భరిస్తూ పంటి బిగువన బాధను దిగమింగుతూ కాలం వెళ్లదీస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: