లూహన్ స్కీ దగ్గర ప్రస్తుతం యుద్ధం భీకరంగా కొనసాగుతుంది. నాటో దేశాలకు సంబంధించిన సైనికాధిపతి ఉక్రెయిన్ కు ఒక హెచ్చరిక జారీ చేశారు. ఆయుధాల వాడకాన్ని రష్యా పెంచేసింది. దాదాపు ప్రతి రోజు 20 వేల వరకు మిస్సైల్స్, బాంబు దాడులను చేస్తోందన్నారు. ఉక్రెయిన్, నాటో దేశాలు కలిపి కేవలం 6 వేల వరకు వాడుతున్నాం. అయినా మన వద్ద దాడి చేయడానికి ఆయుధాలు సరిపోవడం లేదని వాపోతున్నారు. ఆయుధాల తయారీలో కూడా వెనకబడి ఉన్నామని చెప్పారు. దీని వల్ల యుద్ధంలో అలసిపోయే పరిస్థితి ఎదురవుతోంది. శత్రువు బలంగా దాడి చేస్తుంటే చూస్తూ ఉండే పరిస్థితి ఎదురవుతుందని అన్నారు.
అమెరికా ఓ పక్కన ఆయుధాగారాలను నింపేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నామని చెబుతోంది. అయితే ఫైటర్ జెట్స్, మిస్సైల్స్, ఇతర ఆయుధాల ఉత్పత్తి పెంచేందుకు పని చేస్తున్నాం, ఇవన్నీ వచ్చేస్తే రష్యాను ఎదుర్కొవడం సులభమవుతుందని అమెరికా చెబుతోంది. ఆయుధాలు సమకూరితే రష్యా ఎయిర్ క్రాప్ట్ లను ఈజీగా నేలకూల్చవచ్చని భావిస్తోంది.
అయితే ఉక్రెయిన్ కు ఇక్కడ మరొక సమస్య ఎదురవుతోంది. బెలారస్ కూడా సైనిక పరంగా యుద్ధం చేసేందుకు సిద్ధమవుతుంది. పోలాండ్ కు సమీపంలో బెలారస్ సైన్యానికి రష్యా సైన్యం శిక్షణ ఇస్తోంది. దీంతో మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంలా తయారైంది ఉక్రెయిన్ పరిస్థితి. ఇప్పటి వరకు రష్యాకు సహకరించిన దేశం ఏదీ లేదు. ఇప్పుడు బెలారస్ తోడుతో రష్యా యుద్ధంలో చెలరేగే అవకాశం ఉంది