ఉక్రెయిన్  చివరిలో ఉన్న డొనేట్ స్కీ, రుమాన్స్ కి, జెపోరీజియా ప్రాంతానికి వెళ్లేటువంటి రూట్లో ఉండే భాగ్పుత్ అనే ప్రాంతంలో 6 నెలల నుంచి తీవ్ర యుద్ధం జరుగుతోంది. ఈ కీ నగరాన్ని స్వాధీనం చేసుకోవడానికి ఆరు నెలల నుండి పోరాటం జరుగుతూనే ఉంది. ఎందుకంటే అది ఒక లింక్ సిటీ కాబట్టి. కానీ దాని చుట్టూ ఉన్న దాన్ని స్వాధీనం చేసుకున్నారు కానీ బాగ్పుత్ లో ప్రతిఘటన జరుగుతూనే ఉంది. ఇన్ని రోజులూ జరిగింది.


అక్కడ మూడు వైపులా అష్టదిగ్బంధనం చేసి ఒకే ఒక దారి మిగిల్చారు. మీరు లొంగిపొండి లేదా వెనక్కి వెళ్లిపోండి వెనక్కి వెళ్ళిపోతే దొరికిపోతారు, లొంగిపోతే అరెస్టు చేస్తాం మీ ఇష్టం అని ప్రకటించారు. అక్కడ బయట నుండి ఆయుధాలు వచ్చే పరిస్థితి లేదు. ఆహారం వచ్చే పరిస్థితి లేదు. లేదా పైనుంచి ఏమైనా చేద్దాం అంటే పేల్చిపడేస్తున్నారు కాబట్టి ఇక రిట్రీట్ అవుదాం, వెనక్కి వెళ్ళిపోదామని ప్రిపేర్ అవుతున్న సైన్యానికి  ఉక్రెయిన్ అధ్యక్షుడు నుండి ఒక స్పష్టమైన ఆదేశం వచ్చింది.


మీరు పోరాడండి లేదా చచ్చిపోండి, కానీ వెనక్కి రావద్దు, రష్యా వాళ్లకి లొంగిపోవద్దు. అవసరమైతే ప్రాణాలు పోయేదాకా పోరాడండి, లొంగిపోద్దు వెనక్కి రావద్దు అని ఆదేశం ఇచ్చాడు. అంటే చావండి తప్పించి పొరపాటున కూడా ఆ ప్రాంతాన్ని అప్పచెప్పి రావద్దు అన్నటువంటి విషయాన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు చెప్పడం జరిగింది.


దీంతో చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి ఒకటైతే, జెలెన్స్కి అహంకారం వల్ల, ఇప్పుడు క్యార్సన్ నుండి రష్యా వెనక్కి వెళ్ళిపోయింది. వాళ్ళను చచ్చిపోమని వాళ్ళ అధ్యక్షుడు చెప్పలేదు. అయితే ఉక్రెయిన్ అధ్యక్షుడు మాత్రం చచ్చిపోమంటున్నాడు అంటూ వాళ్ళ సొంత సైన్యమే వీడియో పోస్ట్ లు పెడుతుంది. మాకు ఆయుధాలు, ఆహారం ఇవ్వట్లేదు వెనక్కి వెళ్లి మళ్లీ ఆయుధాలు వచ్చాక తిరిగి యుద్ధం చేద్దాం అంటే చచ్చిపోమంటున్నాడు మా అధ్యక్షుడు అని చెప్తున్నారు ఇలా ఉక్రెయిన్ సైనికుల పరిస్థితి దయనీయంగా ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: