
ఇప్పుడు మనకు ఏదైనా ఆరోగ్య సమస్య వేస్తే హాస్పటల్ కి పోయి డబ్బులు తగలపెట్టే టైంలో, డాక్టర్ ఇంటికి వచ్చి బీపీ, షుగర్ ఇలాంటివన్నీ టెస్ట్ చేసి, మందులు రాసి ఉచితంగా ఇస్తే ఏ వృద్ధురాలు వద్దంటుంది, ఏ వృద్ధుడు వద్దనకుంటాడు. ఏ గృహిణి వద్దంటుంది, ఏ ఇంటి పెద్ద వద్దంటాడు. కానీ ఇది అమలు చేయడం అనేది ఒక పెద్ద తపన, పెద్ద యజ్ఞం. ఆషామాషీ వ్యవహారం కాదు. ఇది అమలు చేస్తారా లేదా అనేది చూడాలి.
కానీ అమలు చేస్తే అది కూడా సచివాలయ వ్యవస్థ ఇంకా, వాలంటరీ వ్యవస్థల కన్నా అద్భుతమైన వ్యవస్థ లాగే ఉంటుంది. సచివాలయ వ్యవస్థ పై గతంలో తెలుగుదేశం వ్యాఖ్యలు చేసుకుంటూ వచ్చింది. ఇప్పుడు మాత్రం వాలెంటరీ వ్యవస్థను రద్దు చేయం, సచివాల వ్యవస్థను కూడా రద్దు చేయం అంటున్నారు. ఇది తాజాగా లోకేష్ బాబు చేసిన ప్రకటన. ఇది ఒక మంచి ఆలోచన.
గ్రామ సచివాలయ ఉద్యోగస్తుల్ని కొనసాగిస్తారు, అందులో ఎట్లాంటి సందేహం లేదు. ఎవరు మార్చడానికి కూడా లేదు. సచివాలయ వ్యవస్థను రద్దు చేస్తే వారిని వేరే ప్రభుత్వ ఉద్యోగానికి మార్చాల్సిందే. ఎందుకంటే వాళ్ళందరూ పర్మినెంట్ అయిపోయారు కాబట్టి తీసేయడానికి సాధ్యం కాదు. గ్రామ సచివాలయం వ్యవస్థను కూడా కొనసాగిస్తామనడం మాత్రం మంచి పరిణామంగా చెప్పుకోవచ్చు.