హైదరాబాద్‌లో నవీన్ హత్య కేసు ఒక సంచలనం అని చెప్పాలి. ట్రయంగిల్ లవ్ స్టోరీలో ఇప్పటి వరకు అందరూ హరిహరకృష్టనే విలన్ గా చూశారు. కానీ అసలు విషయం బయటపడే సరికి అందరూ షాక్ కు గురయ్యారు. నవీన్, హరి ల గర్ల్ ప్రెండ్ నిహారిక. పోలీసులకు నిహారిక ఇచ్చిన స్టేట్ మెంట్ లో సంచలన విషయాలు ఒక సారి  చూద్దాం.


నవీన్ నిహారిక ఇద్దరు ప్రేమికులు. ఇంటర్ నుంచే ప్రేమించుకుంటున్నారు. ఇద్దరు నిహారిక ఇంట్లోనే కలుసుకునేవారు. వీరి ప్రేమ చాలా కాలం పాటు కొనసాగింది. అప్పుడప్పుడు నవీన్ కోపగించుకున్న సమయంలో హరి సర్దిచెప్పేవాడు. అలా చాలా రోజుల పాటు కలిసి ఉన్నారు.  తర్వాత ఇద్దరి మధ్య గొడవలు రావడంతో విడిపోయారు. దీంతో నవీన్ కు దూరంగా నిహారిక ఉంటోంది. అనంతరం హరి, నిహారికను ప్రేమిస్తున్నానని చెప్పాడు. దీంతో నిహారిక ఒకే అంది. ఇద్దరు కలిసి చెట్టా పట్టాలు వేసుకుని తిరుగుతున్నారు.


మళ్లీ సడెన్ గా నవీన్ నిహారికకు పోన్ చేసి నిన్ను కలవాలనుంది అని అన్నాడు. అప్పుడు నిహారిక హరికి చెప్పింది. అంతే నవీన్ ను అడ్డు లేకుండా చేస్తాను అన్నాడు. నిహారిక వద్దని వారించింది. అయినా హరి, నవీన్ పై కోపం పెంచుకున్నాడు. నవీన్ ను చంపాలని నిర్ణయించుకున్నాడు. హరి ఇంటికి నిహారిక వెళ్లినపుడు నవీన్ ను చంపేందుకు కొన్న గ్లౌజులు, కత్తిని ఆమెకు చూపించాడు. వద్దు ఇలాంటివి చేయొద్దని నిహారిక చెప్పింది. జోక్ చేస్తున్నాడనుకుంది.


కానీ ఇంటర్ స్నేహితులు కలిసిన సమయంలో నవీన్ ను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ముక్కలు ముక్కలుగా నరికేశాడు. నిహారికను కలిసి నవీన్ ను చంపిన విషయం చెప్పాడు. ఆమె ఎవరికి చెప్పను.. అని రూ.1500 వచ్చి ఎక్కడికైనా వెళ్లిపో అంది. నిహారిక బాబాయ్ లాయర్ కావడంతో ఈ విషయం చెబితే  లొంగిపొమ్మని సలహా ఇవ్వడంతో హరి అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: