అమెరికాలో ప్రస్తుతం హెచ్ 1 బి వీసా విషయంలో తీసుకున్న నిర్ణయం సంచలనం కలిగిస్తోంది. ఆ వీసా ఉన్న చాలా మందికి ఉద్యోగాలు పోతున్నాయి. అయితే ఇక్కడ ఒక లాభం చేకూరింది. హెచ్ వన్ బి వీసా ఉన్నవారితో వాళ్ల భార్యలకు వీసాలు వచ్చాయి. హెచ్ 4 వీసాతో భార్యలు కూడా ఉద్యోగం చేశారు.  తాజాగా కోర్టు ఇచ్చిన తీర్పు కాస్త ఆనందం కలిగించేలా ఉంది. అమెరికాలో ఉన్న  2004 కు ముందు నుంచి ఉన్న వాళ్లు వారి వీసాలను రెన్యూవల్ చేసుకునేందుకు భారత్ కు వచ్చి దాదాపు 6, 7 నెలలు తిరిగేవారు. ఇప్పుడు అలాంటేదేమీ లేకుండానే అమెరికాలో నే వీసాను రెన్యూవల్ చేసుకునేలా బైడెన్ సర్కారు అవకాశం కల్పిస్తోంది.


అమెరికా, భారతీయులను వదులుకునేందుకు సిద్ధంగా లేదు. భారతీయులు కనే కల అమెరికాకు వెళ్లి అక్కడ స్థిరపడాలి. ఎక్కువ డబ్బులు సంపాదించాలి. అక్కడి పౌరసత్వం పొందాలి. అనేక కలలను కంటారు. దాని కోసం ఎంతో కష్టపడతారు. చాలా మంది పెళ్లిళ్లు చేసుకుని అమెరికాకు విసిట్ వీసా మీద వెళ్లి అక్కడ హెచ్ 4 వీసా కోసం ప్రయత్నం చేస్తుంటారు. గర్భిణిగా ఉన్న సమయంలో వెళితే అక్కడ బిడ్డను కంటే బిడ్డకు అక్కడి పౌరసత్వం వస్తుంది. దీంతో పిల్లలతో పాటు తల్లిదండ్రులకు కూడా ఇబ్బంది ఉండదు.


ఇలా చాలా మంది ఇండియన్లు పెళ్లి చేసుకుని గర్భిణిగా ఉన్న సమయంలోనే వెళ్లే వారు. సిటిజిన్ షిప్ కోసం చేయని ప్రయత్నాలు లేవు. ప్రస్తుతం భారతీయులకు కలిసొచ్చే తీర్పు ఇవ్వడంతో ఆనందంతో ఉప్పొంగి పోతున్నారు. 2020-21 సమయంలో లక్ష మందికి హెచ్1బీ వీసాలు ఇచ్చామని బైడెన్ ప్రభుత్వం చెప్పింది. 2023 లో ఒక మిలియన్ వీసాలు ఇస్తామని చెబుతున్నారు. అందులో కూడా ఎక్కువగా ఇండియన్స్ కే ఇస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే తక్కువ జీతంతో ఎక్కువ పని చేస్తారని అమెరికా నమ్మకం.


మరింత సమాచారం తెలుసుకోండి:

NRI