చదువుకున్న వారే డబ్బులకు కక్కుర్తి పడి ఉద్యోగాలను అమ్ముకుని నిరుద్యోగుల ఆశల్ని అడియాశలు చేస్తున్నారు. టీఎస్ పీఎస్సీలో జరిగిన పేపర్ లీక్ వ్యవహారం చినికి చినికి గాలివానగా మారుతోంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 15 పేపర్లు లీక్ అయ్యాయి.
సిట్ విచారణలో నమ్మలేని నిజాలు బయట పడుతున్నట్లు తెలుస్తోంది. ఇంత జరుగుతున్నా రాష్ట్రంలో భయం లేని పరిస్థితి ఉంది. తాజాగా పదో తరగతి తెలుగు, హిందీ ప్రశ్నా పత్రాలను పరీక్ష ప్రారంభం అయినా పది నిమిషాలకే వాట్సాప్ లో బయటకు పంపించారు. అది కాస్త వైరల్ గా మారి నిమిషాల్లో, జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారుల వరకు వెళ్లింది. ఈ విషయంలో కలెక్టర్ నలుగురు టీచర్లను సస్పెండ్ చేశారు.


అసలు ఇవేమీ లీకులో అర్థం కాని పరిస్థితి తయారైంది తెలంగాణలో. విద్యావంతులైన మూర్ఖులే ఇలాంటి దారుణాలకు ఒడి గడుతున్నారు. కానీ ఒక్కరు చేసినా తప్పుకు నిరుద్యోగులు బలవుతున్నారు. ఎవరైతే పేపర్ లీకేజీకి పాల్పడ్డారో వారిని కఠినంగా శిక్షించాలి. కానీ రాసినా పేపర్లను రద్దు చేయడంతో అప్పటి వరకు ఎంతో నమ్మకంతో చదివి రాసిన వారు సైతం తీవ్ర నిరాశకు లోనవుతారు. టీ ఎస్ పీఎస్సీలో పేపర్ లీకేజీకి కారణమైన వారి ఉద్యోగాలను తొలగించి నిరుద్యోగులకు, భరోసా కల్పించాల్సిన అవసరం ఉంది.


ప్రభుత్వం పేపర్ లీకేజీ  చేయించినట్లు  ప్రతిపక్షాలు ఆరోపణలు  చేస్తున్నాయి.  సిట్ అన్ని అంశాలను  పరిగణలోకి తీసుకుని పూర్తి స్థాయిలో విచారణ చేస్తోంది. ఇలాంటి పేపర్ లీక్ లు మళ్లీ జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని విద్యావంతులు అభిప్రాయపడుతున్నారు. తిని తినకుండా హైదరాబాద్ లో హస్టళ్లలో ఉండి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఎలాగైనా ఉద్యోగం సాధించాలన్న కసితో చాలా మంది నిరుద్యోగులు కష్టపడుతున్నారు. వారందరికీ న్యాయం జరిగేలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. పేపర్ లీకేజీ నిందితులను కఠినంగా శిక్షించాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: