పాకిస్థాన్ లో సైనిక పాలన వచ్చే అవకాశాలు ఉన్నాయనే అనుమానాలు కలుగుతున్నాయి. బిలావల్ బుట్టో తాజాగా చేసిన ప్రకటనతో దీనికి బలం చేకూరుతోంది. పాక్ లో ధరలు పెరిగిపోతున్నాయి. ఆదాయం లేదు. అంతకంతకు ఆర్థిక సంక్షోభం తీవ్రమవుతోంది.  అమెరికా, యూరప్ దేశాలు సహకరించడం లేదు.


ఐఎంఎఫ్‌ లోన్లు ఇవ్వడం లేదు. ప్రజాగ్రహం పెరిగిపోతుంది. కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందన్న నమ్మకం అమెరికాకు లేదు. అందుకే సపోర్టు ఇవ్వడం లేదు. చైనాకు మద్దతుగా పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పని చేశారు. అమెరికాకు మద్దతుగా షాబాజ్ షరీప్ పని చేస్తున్నారు. ఇలా ఒక్కో దేశంతో ఒకరు కలిసి పని చేశారు. కానీ ప్రస్తుతం పూర్తిగా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పాక్ కు దాని నుంచి ఎలా బయట పడాలో తెలియడం లేదు.


అయితే పాకిస్థాన్ లో ఆధిపత్యం కావాలని అమెరికా కోరుకుంటోంది. ఇదే స్థాయిలో కూడా చైనా కూడా కోరకుంటోందని తెలుస్తోంది. ప్రస్తుతం పాక్ ప్రభుత్వాన్ని కూలదోయాలని పాక్ సైనికాధ్యక్షుడు బాజ్వా ప్రయత్నాలు చేస్తున్నారని బిలావల్ బుట్టో ఆరోపించారు. ప్రజాగ్రహం విపరీతంగా ఉన్న వేళ, మళ్లీ సైన్యం చేతికి అధికారాలు వెళ్లిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితిని గతంలో పాకిస్థాన్ ఓ సారి ఎదుర్కొంది. పాకిస్థాన్ మాజీ సైనికాధ్యక్షుడు ముషారప్ అయిదేళ్ల పాటు పాక్ ని పరిపాలించాడు. ఒక సైనికాధికారిగా ఉండి పాక్ ని నడిపించిన నేతగా ఎదిగారు.


గతంలో మహమ్మద్ అలీ జిన్నా కూడా సైనిక పాలనను కొనసాగించినట్లు తెలుస్తోంది. పాక్ ఇప్పట్లో కోలుకునేలా లేదు. ప్రపంచంలో ని అగ్రరాజ్యం అమెరికా, చైనా రష్యా, యూరప్ లాంటి దేశాలు ఆదుకుంటే తప్ప ప్రస్తుతం కోలుకునేలా లేదు. పాక్ లో  అంతర్గతంగా అలజడులు రేగే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. పాకిస్థాన్ ప్రభుత్వం ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కిస్తుందా లేక సైన్యం చేతికి అధికారం వెళ్లిపోతుందా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: