అయోధ్యలో రామాలయాన్ని కూల్చి వేస్తామని  ఆల్ ఖైదా అనే ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. ఇప్పుడు కాకున్నా ఇంకా 100 ఏళ్లు తర్వాతైనా కూల్చి వేస్తామని చెప్పింది. మత రాజ్యాల స్థాపనల కారణంగా మొగల్ సామ్రాజ్యంలో ఉన్న చాలా మంది రాజులు, బాబర్, అక్బర్, ఔరంగాబాద్ లాంటి రాజులు చాలా హిందూ దేవాలయాలను కూలగొట్టారు. ఆ స్థానంలో మసీదులు నిర్మించారు.


అలాంటి దే బాబ్రీ మసీదు  స్థానంలో గతంలో రామాలయం ఉండేదని ఏళ్ల తరబడి జరిగిన వాదోపవాదనల తర్వాత సుప్రీం కోర్టు అక్కడ రామాలయం కట్టుకోవచ్చని తీర్పును ఇచ్చింది. శర వేగంగా రామాలయ నిర్మాణం కూడా జరుగుతోంది. రామాలయ నిర్మాణం జరిగిన తర్వాత కూడా ఆల్ ఖైదా లాంటి ఉగ్రవాద సంస్థ దాన్ని కూల్చి వేస్తామని ప్రకటించడం దారుణం.


ఇజ్రాయిల్ లోని మసీదులోకి అక్కడి సైన్యం వెళ్లి దాడులు చేసిందని, ఇండియాలోని బిహార్, బెంగాల్ లో ముస్లింలకు దాడులు జరిగాయని ఇలాంటి వి చూస్తూ ఊరుకోమని ఆల్ ఖైదా తన స్టేట్ మెంట్ లో చెప్పింది. అయితే బిహార్, బెంగాల్ లలో రామనవమి సందర్భంగా జరిగిన దాడిలో హిందువులు ఎక్కువ మంది గాయపడ్డట్లు తెలుస్తోంది. అందుకే కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఎక్కడైతే దాడులు జరిగాయో ఎవరైతే చేశారో వారిని తలకిందకి వేలాడదీస్తామని ఘాటైన హెచ్చరికలు చేసిన విషయం తెలిసిందే.


కానీ విషయాన్ని సరిగా అర్థం చేసుకోకుండా  ఆల్ ఖైదా లాంటి ఉగ్రవాద సంస్థలు ఇలా దారుణమైన స్టేట్ మెంట్స్ ఇవ్వడం పనికి మాలిన చర్యగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇండియాలో  ప్రతిదీ కోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం తీసుకొచ్చే చట్టాల ద్వారా జరుగుతున్న విషయాన్ని ముందుగా ఉగ్రవాద సంస్థలు తెలుసుకోవాలి. ప్రపంచంలో ఎక్కడ లేని స్వేచ్ఛ ఇండియాలో ఉందనే విషయాన్ని వారు గమనించాలి. దాడులు, ప్రతి దాడులు సమస్యకు పరిష్కారం కాదని ఆల్ ఖైదా భావించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: